ETV Bharat / bharat

'మిస్సైన ఆ యువకుడు సేఫ్​'.. భారత్​కు చైనా సమాచారం

author img

By

Published : Jan 23, 2022, 1:50 PM IST

missing boy from Arunachal
తప్పిపోయిన యువకుడు

missing boy from Arunachal: అరుణాచల్​ప్రదేశ్​లో తప్పిపోయిన యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా సైన్యం భారత్​కు సమాచారం ఇచ్చింది. త్వరలోనే అతడ్ని మన దేశానికి అప్పగించే అవకాశముంది.

missing boy from Arunachal: అరుణాచల్​ప్రదేశ్​ షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో తప్పిపోయిన 17ఏళ్ల బాలుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా సైన్యం భారత్​కు తెలిపింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. అధికారిక ప్రక్రియ పూర్తి అయిన తరువాత బాలుడ్ని మన సైన్యానికి అప్పజెప్పనున్నట్లు రక్షణ శాఖ పీఆర్​ఓ హర్షవర్ధన్​ పాండే తెలిపారు.

తొలుత ఆ యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం వారి సాయం కోరినట్లు భారత సైన్యం పేర్కొంది. ప్రోటోకాల్​ ప్రకారం అతడిని గుర్తించి.. భారత్​కు అప్పగించాల్సిందిగా కోరినట్లు తెలిపింది.

ఈ నెల 19 వ తేదీన అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ ఆరోపించారు. అయితే చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకున్న మరో యువకుడు.. స్థానిక అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ట్వీట్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: నేతాజీకి కోవింద్, మోదీ నివాళులు.. సెలవు ప్రకటించాలన్న దీదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.