ETV Bharat / bharat

'మహా'లో మరో 56 వేల  కరోనా కేసులు

author img

By

Published : Apr 8, 2021, 10:56 PM IST

COVID-19 cases
కరోనావైరస్​

కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మహారాష్ట్రలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొవిడ్​ పంజా విసురుతోంది.

మహారాష్ట్రలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతన్నాయి. తాజాగా 56,286 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 32 లక్షల 29 వేలు దాటింది. మరో 376 మంది కరోనాకు బలయ్యారు. 36,130 మంది మహమ్మారిని జయించారు.

7 లక్షలకు చేరువలో..

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒక్కరోజే 7,437 మందికి పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మరో 24 మంది మృతి చెందారు.

యూపీలో విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 8,490 కేసులు వెలుగుచూశాయి. మరో 39 మంది చనిపోయారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొవిడ్​ పంజా విసురుతోంది. కొత్తగా 6,570 మంది వైరస్​ బారిన పడగా.. 36 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల 40 వేలు దాటింది.

తమిళనాట 4 వేల కేసులు

తమిళనాడులో రోజువారి కరోనా కేసుల సంఖ్య 4 వేలు మార్కును దాటింది. ఒక్కరోజే 4,276 కేసులు నమోదవగా.. 19 ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో మరో 4,353 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11 లక్షల 50 వేలకు చేరువలో ఉంది. తాజాగా 18 మంది కరోనాతో మరణించారు.

రాష్ట్రంతాజా కేసులుతాజా మరణాలు
మధ్యప్రదేశ్4,32427
గుజరాత్4,02135
పంజాబ్3,11956
హరియాణా 2,872 11
రాజస్థాన్​3,526 20

ఇదీ చూడండి: 'టీకా వేసుకోండి.. రూ.5లక్షలు గెలుచుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.