ETV Bharat / bharat

'మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపుర్ కేసు దర్యాప్తు'

author img

By

Published : Nov 15, 2021, 2:09 PM IST

Updated : Nov 15, 2021, 3:34 PM IST

Lakhimpur Kheri case:
లఖింపుర్ కేసు దర్యాప్తుపై బుధవారం సుప్రీం తీర్పు

లఖింపుర్​ ఖేరి కేసు దర్యాప్తుపై బుధవారం ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది(lakhimpur kheri supreme court). సిట్​ బృందంలో సీనియర్​ ఐపీఎస్​ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారం సమర్పించాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది(Lakhimpur Kheri case).

లఖింపుర్ ఖేరి ఘటనపై(Lakhimpur Kheri case) దర్యాప్తును హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో జరిపేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది(lakhimpur kheri supreme court). సిట్​ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా యూపీ ప్రభుత్వం సిఫారసు చేయాలని పేర్కొంది.

లఖింపుర్ కేసుపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని, యూపీ రాష్ట్రానికి చెందని, హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలని నవంబర్ 8న సుప్రీంకోర్టు ఆదేశించింది(lakhimpur kheri supreme court hearing ). అప్పటివరకు జరిగిన దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ తాము ఆశించినట్లుగా జరగడం లేదని వ్యాఖ్యానించింది. విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు నిరాకరించింది. సిట్​కు నేతృత్వం వహించేందుకు పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్​ కుమార్ జైన్​, జస్టిస్ రంజిత్ సింగ్ పేర్లను సిఫారసు చేసింది. ఇందుకు యూపీ ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నట్లు సోమవారం కోర్టుకు తెలిపింది. అయితే వీరితో పాటు సుప్రీం మాజీ జడ్జి సహా మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని, తీర్పు బుధవారం ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది(lakhimpur kheri news).

కేసు వాదనల సందర్భంగా లఖింపుర్ కేసు(lakhimpur kheri news ) విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందంలో(సిట్​) తక్కువ స్థాయి ర్యాంకు గల అధికారులు ఉన్న అంశాన్ని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం లేవనెత్తింది. సిట్​ బృందంలో సీనియర్ ఐపీఎస్​ అధికారులకు చోటు కల్పించాలని యూపీ ప్రభుత్వానికి సూచిందించి. వీరి స్వస్థలం ఉత్తర్​ ప్రదేశ్​ అయి ఉండకూడదని షరతు విధించింది.

లఖింపుర్​ ఘటనను(lakhimpur kheri incident) సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ(Chief Justice N V Ramana) నేతృత్వంలోని ధర్మాసనం. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్​ న్యాయవాది హరీష్​ సాల్వే వాదనలు వినిపించారు.

ఇదీ కేసు..

అక్టోబర్​ 3న జరిగిన లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో(lakhimpur kheri violence) నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కారు.. నిరసన తెలుపుతున్న రైతులపైకి దూసుకెళ్లిన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా కుమారుడు అశిష్​ మిశ్రాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: లఖింపుర్ హింసపై విచారణ.. యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!

లఖింపుర్ ఖేరి​ కేసులో మరో ఇద్దరు అరెస్టు

Last Updated :Nov 15, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.