ETV Bharat / bharat

Kota Suicide Prevention : ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్లలో వలలు.. ఫ్యాన్​​లకు స్ప్రింగ్​లు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 2:33 PM IST

Updated : Aug 27, 2023, 2:53 PM IST

Kota Suicide Prevention : పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రాజస్థాన్‌లోని కోటాలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ బలవన్మరణాలను నివారించేందుకు కోటాలోని హాస్టళ్లు, పీజీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల్లోపల స్ప్రింగ్‌ కాయిల్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Kota Suicide Prevention
Kota Suicide Prevention

Kota Suicide Prevention : కోచింగ్‌ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు (Kota Suicide Rate) ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నివారణకు వసతి గృహాలు, పీజీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగంతో కలిసి.. హాస్టళ్లు, పీజీల యజమానులు ఆత్మహత్య నిరోధక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ వలలను కడుతున్నారు. సాదాసీదాగా కాకుండా.. స్టీల్‌ వైర్లతో వాటిని నిర్మిస్తున్నారు. ఈ వైర్లు చాలా బలంగా ఉంటాయని ప్రత్యేక పనిముట్లుతో మాత్రమే వీటిని కత్తిరించే వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు. బాల్కనీ నుంచి కాకుండా పై అంతస్తు నుంచి దూకినా ఏమీ కాకుండా గ్రౌండ్‌లో వలలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

కోటా హాస్టల్స్‌, పీజీల్లోని గదుల్లో స్ప్రింగ్‌ కాయిల్స్‌ ఫ్యా‌న్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల ఉరి బిగించుకున్నా ఏం కాదని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లను వేలాడదీసే రాడ్ల కింద స్ప్రింగ్‌లను డిజైన్‌ చేస్తున్నారు. స్ప్రింగ్‌ సాగడం వల్ల.. గొంతుపై ఒత్తిడి ఉండకుండా చూస్తున్నారు. విద్యార్థులు చనిపోవాలంటే ఎక్కువగా దూకడం, లేదా ఉరి మార్గాలే ఎంచుకుంటున్నారని అందుకే ఇలా చేస్తున్నట్లు యజమానులు చెప్పారు.

వీక్లీ ఆఫ్​లు ఇవ్వాలని ఆదేశం
ఈ ఏర్పాట్లతో పాటు కోచింగ్‌ సంస్థలు కచ్చితంగా విద్యార్థులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా.. ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించని హాస్టళ్లు, పీసీ వసతులను వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

'ఫ్యాన్లు కాదు.. ఒత్తిడి తగ్గించాలి'
మరోవైపు ఈ ఫ్యాన్లను మార్చడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలంటే మార్చాల్సింది ఫ్యాన్లు కాదని.. వారి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని సూచనలు చేస్తున్నారు.

Kota Coaching Centre List : కోటాలో కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు ఇక్కడకు కోచింగ్‌ తీసుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది కోటాలో 20 మంది విద్యార్థులు (Kota Suicide Data) పరీక్షల ఒత్తిళ్లు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు చెప్పారు.

కొండెక్కుతున్న విద్యాదీపాలు- గంటకో విద్యార్థి బలవన్మరణం

students suicides in Telangana : చావు పరిష్కారం కాదు.. బతికి సాధిద్దాం బిడ్డా

Last Updated : Aug 27, 2023, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.