ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి చిన్నారి మృతి.. ఛార్జింగ్​ అవుతుండగానే..

author img

By

Published : Oct 2, 2022, 3:45 PM IST

Etv kid death after electric scooter battery explodes in  maharastra

Electric Bike Battery Blast : పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో వినియోగిస్తున్న ఎలక్టిక్​ బైక్​ వారి ఇంట విషాదం నింపింది. ఛార్జింగ్​ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలడం వల్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

Electric Bike Battery Blast: మహారాష్ట్రలోని వసాయ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్​లో ఉన్న ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించాడు.

kid death after electric scooter battery explodes in  maharastra
మృతి చెందిన బాలుడు

అసలేం జరిగిందంటే..
తూర్పు వసాయ్​ ప్రాంతంలో రాందాస్​ నగర్​కు చెందిన షానవాజ్​ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్​ అన్సారీ కుమారుడు షబ్బీర్, తల్లి రుక్సాన్​కు తీవ్రగాయాలయ్యాయి.

kid death after electric scooter battery explodes in  maharastra
షాన్​వాజ్​ అన్సారీ వినియోగిస్తున్న బ్యాటరీ బైక్​ ఇదే

షబ్బీర్​కు కాలిన గాయాలు ఎక్కువగా అవ్వడం వల్ల చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ షబ్బీర్​ మరణించాడు. స్కూటీ కంపెనీ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.