ETV Bharat / bharat

కరోనా పంజా- దిల్లీలో మరో 7వేల మందికి వైరస్​

author img

By

Published : Nov 8, 2020, 10:03 PM IST

Updated : Nov 8, 2020, 10:52 PM IST

దేశంపై కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. స్థిరంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 85లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 1.26లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దిల్లీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా​ వ్యాప్తి అధికంగా ఉంది. దిల్లీలో 7వేలు.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో 5వేల చొప్పున కరోనా కేసులు వెలుగుచూశాయి.

Kerala logs 5,440 new COVID-19 cases and 24 deaths
కరోనా పంజా- కేరళలో మరో 5వేల మందికి వైరస్​

దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85లక్షల మందికిపైగా కొవిడ్​​ బారినపడ్డారు. వారిలో 1.26లక్షల మంది వైరస్​కు బలయ్యారు. సుమారు 79లక్షల మంది మహమ్మారిని జయించగా.. 5లక్షలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి. దిల్లీలో మరో 7,745 మందికి కరోనా కేసులు బయటపడగా.. బాధితుల సంఖ్య 4.3లక్షలు దాటింది. మరో 77 మంది కరోనాకు బలవ్వగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7వేలకు చేరువైంది.

  • కేరళలో ఆదివారం ఒక్కరోజే 5,440 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 4.86 లక్షలకు పెరిగింది. కొత్తగా 24 మంది వైరస్​కు బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 1,692కు చేరింది.
  • మహారాష్ట్రలో ఒక్కరోజులో 5,092 మందికి వైరస్​ సోకింది. బాధితుల సంఖ్య 17లక్షల 19వేల 858కి పెరిగింది. కొత్తగా 110 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 45,250కి ఎగబాకింది.
  • బెంగాల్​లో కొత్తగా 3,920 మంది కొవిడ్​ ఉన్నట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4,05,314కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,294 మంది కరోనాతో మృతి చెందారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 2,247 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 4,97,668కి చేరింది. మరో 26 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 7,206కు పెరిగింది.
  • తమిళనాడులో ఒక్కరోజులోనే 2,334 మంది కరోనా బారినపడ్డారు. కేసుల సంఖ్య 7.43లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 11,344 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇదీ చదవండి: 'టీకా​ పొందాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే'

Last Updated : Nov 8, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.