ETV Bharat / bharat

నటి హత్యకు రివెంజ్​.. నలుగురు ముష్కరులు హతం.. మూడు రోజుల్లో 10 మంది

author img

By

Published : May 27, 2022, 12:41 PM IST

Kashmir encounter: జమ్ముకశ్మీర్​లో వరుస దాడులతో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులకు చెక్​ పెట్టేపనిలో ఉన్నారు అక్కడి పోలీసులు. ఎన్​కౌంటర్ల జరిపి వారిని మట్టుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులను కూడా మట్టుబెట్టారు.

కశ్మీర్
కశ్మీర్

Kashmir encounter: ఇటీవల జమ్ముకశ్మీర్​లో జరిగిన వరుస ఉగ్రవాద దాడులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ముష్కరుల దాడులకు ఓ కానిస్టేబుల్​, టీవీ నటి బలయ్యారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకలను కట్టడి చేసే చర్యలను ముమ్మరం చేసిన భద్రతా సిబ్బంది.. గురువారం జరిపిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు తీవ్రవాదలను మట్టుబెట్టారు. వీరిలో టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని గుర్తించారు.

"పుల్వామా జిల్లా అవంతీపుర ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో టీవీ నటి అమ్రీన్​ భట్​ హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీరిలో ఒకరు బుద్గామ్​కు చెందిన షాహిద్​ ముస్తక్​ భట్​కాగా మరొకరు పుల్వామాకు చెందిన ఫర్హాన్​ హబీబ్​. అమ్రీన్​ను హత్య చేసిన వీరు ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము."

-పోలీసులు

శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటివరకు ఉగ్రవాద కట్టడి చర్యల్లో భాగంగా మూడు రోజుల వ్యవధిలో 10 మంది ముష్కరులను మట్టుబెట్టారు పోలీసులు. వీరిలో ఏడుగురు లష్కరే తోయిబాకు చెందినవారు కాగా ముగ్గురు జైషే మహమ్మద్​ సంస్థకు చెందిన వారు.

ఇదీ చూడండి : కానిస్టేబుల్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఏడెళ్ల కుమార్తెపైనా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.