ETV Bharat / bharat

'మట్టి'తో 750కి.మీ పాదయాత్ర.. ముఖ్యమంత్రి కోసం...

author img

By

Published : Jul 14, 2022, 5:56 PM IST

శంకర్​ భట్టాచార్య
శంకర్​ భట్టాచార్య

బంగాల్​ విభజనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని జల్పాయ్​గుడి జిల్లాకు చెందిన శంకర్ భట్టాచార్య.. 750 కి.మీ పాదయాత్ర చేపట్టారు. 28 రోజుల తర్వాత బుధవారం కాళీఘాట్‌ చేరుకున్న ఆయన.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవాలని అనుకుంటున్నారు. తనతో తీసుకొచ్చిన మట్టిని ఇచ్చి.. రాష్ట్ర విభజన చేయొద్దని కోరనున్నారు.

గతకొద్ది రోజులుగా బంగాల్​ విభజనపై భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు బంగాల్​ను విభజనకు ఒప్పుకోనేది లేదని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర బంగాల్​లోని జల్పాయ్​గుడి జిల్లాకు చెందిన శంకర్​ భట్టాచార్య అనే ఒక టీఎంసీ కార్యకర్త.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. 750 కిలోమీటర్లు నడిచి.. కాళీఘాట్​కు బుధవారం చేరుకున్నారు. తన వెంట తీసుకొచ్చిన మట్టిని ముఖ్యమంత్రి మమతకు ఇవ్వనున్నారు. బంగాల్ మట్టిని రెండుగా వేరు చేయొద్దని కోరనున్నారు. దీదీని కలిసిన అనంతరం జులై 21న జరిగే అమరవీరుల దివస్ సభకు ఆయన హాజరుకానున్నారు.

శంకర్​ భట్టాచార్య
శంకర్​ భట్టాచార్య

ఎవరీ శంకర్​ భట్టాచార్య?.. జల్పాయ్​గుడి జిల్లాలో దువార్ల ప్రాంతంలో శంకర్​ భట్టాచార్య నివసిస్తున్నారు. కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవిస్తున్నారు. అయితే ఆయనకు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా.. ప్రతి ఎన్నికలో ఆ పార్టీకే మద్దతు పలుకుతారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చాలా గౌరవిస్తారు.

కొన్ని నెలల క్రితం బంగాల్​ విభజనకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. జూన్​ 15న శంకర్​.. తన స్వగ్రామంలో పాదయాత్రను మొదలుపెట్టారు. సుమారు 28 రోజుల తర్వాత బుధవారం బరాసత్​ చేరుకున్నారు. దీదీని ఆదర్శంగా తీసుకుని.. తాను 750 కిలోమీటర్లను అలవోకగా నడిచేశానని ఆయన చెప్పారు. మమత గత 11 ఏళ్లలో దువార్ల ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారని కొనియాడారు.

ఇవీ చదవండి: పాప్​ సింగర్​ దలేర్ మెహందీకి రెండేళ్లు శిక్ష.. కోర్టు నుంచి నేరుగా జైలుకు!

వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ.. 29 గ్రామాలు ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.