ETV Bharat / bharat

వాయుసేన శకటంలో.. శత్రువులను వణికించే రఫేల్​ 'సివంగి'

author img

By

Published : Jan 26, 2022, 12:38 PM IST

India's first woman Rafale fighter jet pilot
India's first woman Rafale fighter jet pilot

Shivangi Singh Rafale: భారత 73వ గణతంత్ర వేడుకల వేళ నిర్వహించిన పరేడ్​, శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. రఫేల్​ ఫైటర్​ జెట్​ తొలి మహిళా పైలట్​ శివాంగి సింగ్​.. వాయుసేన శకటంతో కవాతులో పాల్గొన్నారు. 1946 తిరుగుబాటు అంశం థీమ్​తో ప్రదర్శించిన నేవీ శకటం పలువురిని ఆకర్షించింది.

Shivangi Singh Rafale: భారత 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా పరేడ్​ను ఘనంగా సాగింది. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్​ ఆకట్టుకుంది.

పరేడ్​లో సైన్యం, వాయుసేన, నావికాదళం, కేంద్ర పారాబలగాలు, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ విభాగాలు భాగమయ్యాయి. పలు ఆయుధ వ్యవస్థలు, యుద్ధట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.

REPUBLIC DAY tableau
ఎంటీబీ అర్జున్‌ ఎంకే 1

రఫేల్​ జెట్​ తొలి మహిళా పైలట్​ శివాంగి..

REPUBLIC DAY tableau
భారత వాయుసేన శకటంలో రఫేల్​ ఫైటర్​ జెట్​ తొలి మహిళా పైలట్​ శివాంగి సింగ్​

Rafale Tableau: రఫేల్ ఫైటర్ జెట్​ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్.. భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. ఐఏఎఫ్​ శకటం పరేడ్​లో భాగమైన రెండో మహిళా ఫైటర్​ జెట్​ పైలట్​ శివాంగినే కావడం విశేషం. గతేడాది ఫ్లైట్​ లెఫ్టినెంట్​ భావనా కాంత్​.. పరేడ్​లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్​ జెట్​ పైలట్​గా నిలిచారు.

REPUBLIC DAY tableau
జాతీయ జెండాలను రెపరెపలాడిస్తున్న హెలికాప్టర్లు

వారణాసికి చెందిన శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికైంది. 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్‌ పైలట్ల బృందంలో సభ్యురాలీమె. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక.. రాజస్థాన్‌ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరింది. ఇక్కడే వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ వద్ద శిక్షణ పొందే అవకాశం దొరికింది. మిగ్‌-21 కఠినమైన ఫైటర్‌ జెట్‌. దీన్ని అత్యంత ఎత్తు నుంచి కిందకి దింపేటప్పుడు, టేకాఫ్‌ చేసేటప్పుడు గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. శివాంగి దీన్ని నడపడంలో అసాధారణ ప్రతిభాపాటవాలని ప్రదర్శించి రఫేల్‌ నడిపే అర్హత సాధించింది.

1946 తిరుగుబాటు థీమ్​తో నేవీ శకటం..

Navy Tableau 2022: ఈసారి నౌకాదళ శకటంపై 1946 నాటి నేవీ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. నాడు బ్రిటిష్‌ సర్కారుపై తిరగబడ్డ భారతీయ నావికులు.. స్వాతంత్య్ర ఉద్యమానికి దోహదపడ్డారు.

REPUBLIC DAY tableau
భారతీయ నావికాదళం శకటం

75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశం 'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​' జరుపుకుంటున్నందున.. స్వాతంత్య్రోద్యమంలో నావీ పాత్రను శకటంలో ప్రస్తావించారు.

REPUBLIC DAY tableau
గుజరాత్​ శకటం

ఈ రిపబ్లిక్​ డే పరేడ్​లో పలు రాష్ట్రాల శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒలింపియన్లతో కూడిన హరియాణా శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

REPUBLIC DAY tableau
ప్రత్యేక ఆకర్షణగా ఒలింపియన్లతో హరియాణా శకటం
REPUBLIC DAY tableau
కర్ణాటక శకటం
REPUBLIC DAY tableau
రామమందిరం నమూనాతో ఉత్తర్​ప్రదేశ్​ శకటం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: రాజ్​పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలు

డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన మోదీ.. ఉత్తరాఖండ్ టోపీ, మణిపుర్ కండువాతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.