ETV Bharat / bharat

Corona Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Aug 23, 2021, 10:31 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల(Corona Update) సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25 వేల మందికి వైరస్(Covid-19)​ సోకింది. మరో 389 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid in india
దేశంలో కరోనా కేసులు

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసులు(Corona Update) భారీగా తగ్గాయి. కొత్తగా 25,072 మంది వైరస్(Covid-19) బారిన పడ్డారు. మరో 389 మంది మరణించారు. మరో 44,157 మంది కరోనా​ను జయించారు.

మొత్తం కేసులు: 3,24,49,306

మొత్తం మరణాలు: 4,34,756

కోలుకున్నవారు: 3,16,80,626

యాక్టివ్​ కేసులు: 3,33,924

వ్యాక్సినేషన్

​దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ(Vaccination in India) నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7,95,543 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 58,25,49,595 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ పరీక్షలు

ఆదివారం ఒక్కరోజే దేశంలో 12,95,160 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 50,75,51,399కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి(Global corona virus update) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,51,510మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 8,264 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,25,55,062కి చేరగా.. మరణాల సంఖ్య 44,43,904కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 30,810
  • బ్రెజిల్-​ 14,404
  • ఫ్రాన్స్-​ 17,300
  • బ్రిటన్​- 32,253
  • రష్యా- 20,564

ఇదీ చూడండి: ఆంక్షల సడలింపు.. ఆ రాష్ట్రంలో స్కూల్స్​ రీఓపెన్​

ఇదీ చూడండి: Zycov-D Vaccine: సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.