ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో 36 వేల కొత్త కేసులు.. 540 మరణాలు

author img

By

Published : Aug 20, 2021, 9:46 AM IST

Updated : Aug 20, 2021, 11:48 AM IST

corona cases
కొవిడ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,571మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 540 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,571 మంది వైరస్ బారినపడ్డారు. మరో 540 మంది మరణించారు. ఒక్కరోజే 36,555 మంది కరోనా​ను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,63,605గా ఉంది. 150 రోజుల తర్వాత ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.54 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు: 3,23,58,829
  • మొత్తం మరణాలు: 4,33,589
  • మొత్తం కోలుకున్నవారు: 3,15,61,635
  • యాక్టివ్ కేసులు: 3,63,605

వ్యాక్సినేషన్..

దేశంలో గురువారం 18,86,271 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,26,99,702కు చేరింది. ఒక్కరోజే 54,71,282 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 57,22,81,488 టీకా డోసులు పంపిణీ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,22,258 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,07,99,763కి చేరగా.. మరణాల సంఖ్య 44,16,285కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 1,54,917
  • బ్రెజిల్-​ 35,991
  • ఫ్రాన్స్-​ 23,973
  • బ్రిటన్​- 36,572
  • రష్యా- 21,058

ఇవీ చదవండి:

Vaccination: గర్భిణులకు టీకా.. దుష్ప్రభావాలు ఉన్నాయా?

కరోనా టీకా రెండో డోసు ఎగ్గొట్టిన వారు 3.86 కోట్లు!

Last Updated :Aug 20, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.