ETV Bharat / bharat

How to Pay Property Tax GHMC in Online : ఆన్​లైన్​లో ఆస్తిపన్ను.. సింపుల్​గా చెల్లించండిలా..!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 2:11 PM IST

GHMC Property Tax Pay in Online : మీరు GHMC పరిధిలో నివసిస్తున్నారా? ఆస్తి పన్ను చెల్లించడానికి కార్యాలయానికి వెళ్లడం కుదరట్లేదా..? అయితే ఇది మీ కోసమే. ఇప్పుడు ఇంట్లో నుంచే ఆన్​లైన్​లో సులభంగా మీ ప్రాపర్టీ ట్యాక్స్​ను కట్టేయండి. మరి, అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకోండి.

How to Pay Property Tax in Online
How to Pay GHMC Property Tax in Online

GHMC Property Tax Pay in Online Telugu : ప్రజలు తమ ఆధీనంలో ఉన్న స్థిరాస్తికి సంబంధించి.. స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వానికి వార్షికంగా చెల్లించే పన్నునే ప్రాపర్టీ ట్యాక్స్​గా పరిగణిస్తారు. ఈ ఆస్తుల విలువను.. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థలు మదింపు చేసి.. దాని ఆధారంగా సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నును నిర్దేశిస్తాయి. గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లోనూ ఈ విధంగా ఆస్తి పన్నును బల్దియా అధికారులు వసూలు చేస్తారు.

స్థానిక సంస్థల అభివృద్ధికి.. ప్రజలు పన్ను చెల్లించడం ఎంతో అవసరం. అయితే.. ఇప్పుడు GHMCకి ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax)​ను చెల్లించడానికి నగరంలో ఎక్కడో ఉన్న కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటు నుంచే సులభంగా ఆన్​లైన్​లో చెల్లించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Pay GHMC Property Tax use ghmc.gov.in Portal :

GHMC ఆస్తిపన్ను ఎలా చెల్లించాలో చూద్దాం..

  • మీరు ఆన్​లైన్​లో ఆస్తి పన్ను చెల్లించడానికి.. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • అప్పుడు మీకు హోం పేజీలో వచ్చిన ఈ https://ghmc.gov.in/ ని ఓపెన్​ చేయాలి.
  • అనంతరం 'Online Payments' అనే ట్యాబ్‌ని ఎంచుకుని 'ఆస్తి పన్ను' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు మీ PTIN(ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య), రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్​ను టైప్ చేసిన మీ చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలను వీక్షించాలి.
  • అనంతరం మీ ఫోన్​కు ఒక 'OTP' వస్తుంది.. దానిని అక్కడ అడిగిన బాక్స్​లో నమోదు చేసి 'Submit OTP'ని క్లిక్ చేయండి.
  • అప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను మొత్తం.. ఇలా ప్రాపర్టీ ట్యాక్స్​కు సంబంధించిన వివరాలన్నీ మీకు స్ర్కీన్​పై కనబడతాయి.
  • ఆ తర్వాత, మీరు పన్నును ఏ విధంగా చెల్లిస్తారో ఆ ఆప్షన్​ను ఎంచుకోవాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ పన్నును కట్టవచ్చు.
  • మీ చెల్లింపు సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు వస్తుంది.

ఇలా సింపుల్​గా ఆన్​లైన్​లో GHMCలో మీ ఆస్తి పన్నును చెల్లించవచ్చు. ఇది చెల్లించాలంటే తప్పనిసరిగా మీకు PTIN నంబర్ ఉండాలి. ఒకవేళ ఆ నంబర్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వర్రీ ఆ నంబర్​ను ఆన్​లైన్​లో సులువుగా పొందవచ్చు. అసలు PTIN నంబర్ అంటే ఏమిటి, దానిని ఎలా రూపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్​న్యూస్​.. ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ

జీహెచ్​ఎంసీ ఆస్తిపన్ను పీటీఐఎన్ నంబర్ అంటే ఏమిటో తెలుసా..

How to Create GHMC Property Tax PTIN Number :

What is GHMC PTIN : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)లో ఆస్తి పన్ను చెల్లించడానికి ఈ నంబర్​ను రూపొందించింది. కొత్త ఆస్తుల కోసం 10 అంకెల ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య(PTIN), పాత ఆస్తుల విషయంలో 14 అంకెల సంఖ్యను GHMC ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి అనుమతిస్తుంది. కొత్త ప్రాపర్టీల యజమానులు తమ సేల్స్ డీడ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కాపీలతో పాటు నగర డిప్యూటీ కమిషనర్​కు అప్లికేషన్ పారం ఇవ్వాలి. అప్పుడు అధికారులు వెరిఫికేషన్ చేసి యజమానికి అన్ని చట్టపరమైన పత్రాలు, PTIN, ఇంటి నంబర్​ను జారీ చేస్తారు.

  • ఆన్​లైన్​లో GHMC ఆస్తి పన్ను చెల్లించడానికి PTINని పొందడం ఎలాగో చూడండి..
  • మొదట మీరు తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) అధికారిక వెబ్‌సైట్‌ https://ghmc.gov.in/ కి వెళ్లాలి.
  • అది ఓపెన్ చేసి 'ఆన్‌లైన్ సర్వీసెస్' ఆప్షన్​పై క్లిక్ చేసి.. 'Self Assessment of Property Tax’' అనే దానిని ఎంచుకోవాలి.
  • అప్పుడు దానిని ఓపెన్ మీ మొబైల్ నంబర్ నమోదు చేసి.. 'Send OTP'పై క్లిక్ చేయాలి. ఆపై మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని అక్కడ టైప్ చేసి 'Submit OTP'పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే సెల్ఫ్ అసెస్‌మెంట్ ఫారమ్‌లో మీ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. డ్రాప్‌డౌన్ జాబితా నుంచి సబ్-రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంచుకోవడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్, తేదీని నమోదు చేయడం వంటి వివరాలను టైప్ చేయాలి.
  • ఆ తర్వాత యజమాని పేరు, తండ్రి పేరు, చిరునామా మొదలైన ఆస్తి వివరాలను కూడా తప్పనిసరిగా నింపాలి. అలాగే సేల్ డీడ్ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. చివరగా 'Submit' బటన్​ను క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ ఆన్​లైన్ దరఖాస్తు నగర డిప్యూటీ కమిషనర్​కు పంపబడుతుంది. అనంతరం వారు మీరు నమోదు చేసిన ప్రాంతాన్ని సందర్శించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోన్నారో వారికి PTIN నంబర్​ను అధికారులు జారీ చేస్తారు.

Property Tax in Telangana : రాష్ట్రంలో ఉపగ్రహ సేవలతో ఆస్తిపన్ను మదింపు!

84 శాతం ఆస్తి ప‌న్ను వ‌సూలు చేసిన బల్దియా.. ఈ జోన్​లో బాగా వచ్చాయంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.