ETV Bharat / bharat

How to Link Changed Mobile Number with Aadhaar : మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ మార్చాలా..? అయితే ఈ విధానం ట్రై చేయండి..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 4:50 PM IST

How to Update New Mobile Number in Aadhaar : మీరు మీ మొబైల్ నెంబర్‌కి ఆధార్‌ను లింక్ చేశారు.. కానీ ఆ నంబర్ ఎక్కడో పోయింది. లేదా ఆ ఫోన్ నంబర్ ఇప్పుడు పని చేయట్లేదు? ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. చాలా సింపుల్​గా మీరు మీ కొత్త మొబైల్ నంబర్​ను అప్​డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

How to Link Changed Mobile
How to Link Changed Mobile

How To Link Changed Phone Number in Aadhaar : ప్రస్తుతం దేశంలో ఉన్న గుర్తింపు కార్డుల్లో ఆధార్‌ ఒకటిగా మారిపోయింది.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న పని చేయాలన్నా ఇది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సిమ్‌ కార్డ్‌ మొదలు, గుడిలో దర్శనం టికెట్‌ వరకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కాలేజీల్లో చేరికల వరకు.. దేనికైనా ఆధార్(Aadhaar Card) కంపల్సరీగా ఉండాల్సిందే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మరోవైపు ప్రభుత్వాలు అందిస్తున్న అత్యుత్తమ సేవలు పొందేందుకు ఆధార్‌ను మొబైల్‌ నెంబర్‌ (Aadhaar-Mobile Number)తో అనుసంధానం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (UIDAI) చెబుతోంది.

How to Link New Mobile Number with Aadhaar : అయినా ఇప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తూ ఇంకా లింక్ చేసుకుని ఉండకపోవచ్చు. లేదంటే లింక్ చేసుకున్న మొబైల్ నంబర్(Mobile Number) ఎక్కడైనా పోయినా లేదా ఆ నంబర్ మార్చినా.. అప్పుడు తిరిగి మీరు కొత్తగా తీసుకున్న ఫోన్ నంబర్​ను కచ్చితంగా అప్​డేట్ చేసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి రావచ్చు. అయితే ఇప్పుడే మీరు సింపుల్​గా మీ మార్చిన మొబైల్​ నెంబర్​ను ఆధార్​కు లింక్ చేసుకోండి.

Aadhaar Mobile Number Linking : మీ ఆధార్ కార్డ్​తో మారిన మెుబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలనుకుంటున్నట్లయితే దానికి ఎంతో కష్టపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా మీ కొత్త నంబర్​ను లింక్ చేసుకోవచ్చు. దీని కోసం విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (UIDAI) సులువుగా అప్​డేట్ చేసుకునే సౌకర్యాన్ని మీకు అందుబాటులో ఉంచింది. ఇంకెందుకు ఆలస్యం కింద పేర్కొన విధంగా మీ ఆధార్​ను మొబైల్ నంబర్​కు లింక్​ చేసి అప్​డేట్ చేసుకోండిలా..

Mobile Number Link To Aadhaar Card Online: ఆధార్​తో మొబైల్ నెంబర్‌ లింక్ చేశారా..? ఇలా నిమిషాల్లో చేసేయండి!

How to Aadhaar Link with Changed Phone Number in Online :

ఆధార్​కార్డులో మారిన ఫోన్ నంబర్‌ అప్‌డేట్ చేసుకోండిలా..

  • మీరు ముందుగా ఆధార్ ఎన్​రోల్​మెంట్ కేంద్రాన్ని సంప్రదించి అపాయింట్ మెంట్ తీసుకోవాలి.
  • ఆ తర్వాత అపాయింట్ మెంట్ రోజున ఆధార్ కేంద్రంలోని అధికారిని సంప్రదించాలి. అప్పుడు అక్కడి అధికారికి ఆధార్ ఎన్​రోల్​మెంట్ ఫారమ్​ను పూర్తి చేసి అందించాలి.
  • అప్పుడు ఆధార్ ఏజెంట్ మీరు అందించిన వివరాలను బయోమెట్రిక్ సమాచారంతో సరిపోల్చి చూస్తారు.
  • ఇక మీ అభ్యర్థన మేరకు మెుబైల్ నంబర్ అప్ డేట్ చేసి కొత్త నంబర్ లింక్ చేస్తారు. ఇందుకుగాను సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మార్పు ప్రక్రియ పూర్తైనట్లు ఆధార్ కేంద్రంలోని ఏజెంట్ అక్నాలెజ్డ్ మెంట్ స్లిప్ అందిస్తారు. అందులోని URN నంబర్ ద్వారా మీ మొబైల్ నంబర్ మార్పు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
  • అయితే ఒకసారి మీ ఫోన్ నంబర్ అప్​డేట్ అయిన తర్వాత ఆన్‌లైన్​లో UIDAI అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఫీజు చెల్లించటం ద్వారా పీవీసీ ఆధార్ కార్డును కూడా పొందవచ్చు.

Aadhar Card Crimes : ఆధార్, పాన్‌ కార్డు నంబర్లు ఎవరికైనా ఇస్తున్నారా?... అయితే జాగ్రత్త!

How To Lock And Unlock Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ సేవలను లాక్, అన్‌లాక్ చేయడం తెలుసా..? చాలా ఈజీ..

PVC Aadhar Card Apply : 'ఆధార్'​ పోయిందా? PVC కార్డ్​ కోసం అప్లై చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.