ETV Bharat / business

Financial Deadlines In September : రూ.2000 నోటు మార్పిడి నుంచి ఫ్రీ ఆధార్ అప్​డేట్ వరకు​.. ఆఖరి గడువు ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 5:45 PM IST

September Financial Deadlines
Financial Deadlines In September

Financial Deadlines In September In Telugu : సెప్టెంబర్​ మాసంలో రూ.2000 నోట్ల మార్పిడి నుంచి ఉచిత ఆధార్​ అప్​డేట్ వరకు 7 ముఖ్యమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ ముగుస్తున్నాయి. అందుకే గడువు ముగిసే లోపే ఆయా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. లేకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Financial Deadlines In September : మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా? మీ ఆధార్​ను ఉచితంగా అప్​డేట్ చేసుకోవాలా? అయితే ఇది మీ కోసమే. సెప్టెంబర్​ 30లోపు మీరు రూ.2000 నోట్లను బ్యాంకులో మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్​ పోర్టల్​లో సెప్టెంబర్​ నెలాఖరులోపు ఆధార్​ను అప్​డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సెప్టెంబర్​లో అనేక ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్​లోని 7 ముఖ్యమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్

  • రూ.2000 నోట్ల మార్పిడికి ఆఖరు తేదీ
    Last Date To Return Rs 2000 Notes : మీ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకునేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. అయితే ఈ గడువును మరింత పొడిగించే అవకాశం లేదని లోక్​సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి రాతపూర్వకంగా తెలిపారు. కనుక మీ దగ్గర ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే.. కచ్చితంగా వాటిని గడువులోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం మంచిది.

నోట్ : 2023 మే 19న ఆర్​బీఐ రూ.2000 నోట్ల చెలామణిని నిలిపివేసింది. అప్పటి నుంచి ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్​ 30 వరకు గడువు ఇచ్చింది.

  • చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం
    Small Savings Scheme Aadhar Link : చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్​ నంబర్​ అనుసంధానం చేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం సెప్టెంబర్​ 30 వరకు గడువు ఇచ్చింది. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్​ నంబర్​ను అనుసంధానం చేయకపోతే.. అక్టోబర్ 1 నుంచి ఆయా అకౌంట్లను (ఫ్రీజ్)​ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అందుకే పీపీఎఫ్​, సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ లాంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నవారు.. కచ్చితంగా తమ ఖాతాలకు సెప్టెంబర్​ 30లోపు ఆధార్​ అనుసంధానం చేసుకోవడం మంచిది.
  • డీమ్యాట్ అకౌంట్​, ట్రేడింగ్ అకౌంట్​కు నామినీ ఏర్పాటు
    Nomination Deadline For Demat And Trading Account : డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్నవారు కచ్చితంగా సెప్టెంబర్​ 30లోపు తమ నామినీ(లబ్ధిదారు)లను ఏర్పాటుచేసుకోవాలని సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజ్​ బోర్డ్​ ఆఫ్ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ గడువును చాలా సార్లు పొడిగించడం జరిగింది. ఈ సారి గడువు పొడిగించే అవకాశం తక్కువగా ఉన్నందున.. గడువులోగా మీ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్​లకు నామినీని యాడ్​ చేసుకోవడం ఉత్తమం.
  • ఉచితంగా ఆధార్​ అప్​డేట్
    Aadhaar Free Update : యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్​ అప్​డేట్​ గడువును జూన్​ నుంచి సెప్టెంబర్​ 14 వరకు పొడిగించింది. అందుకే ఆధార్ పోర్టల్​లో గడువులోగా ఉచితంగా ఆధార్​ను అప్​డేట్ చేసుకోవడం మంచిది.
  • యాక్సిస్ బ్యాంక్​ మాగ్నస్​ క్రెడిట్ కార్డ్​ వార్షిక రుసుము పెంపు
    Axis Bank Credit Card Fee : యాక్సిస్​ బ్యాంక్​.. తమ ఖాతాదారుల క్రెడిట్​ కార్డు రుసుములను తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెప్టెంబర్​ 1 నుంచి ఆన్​బోర్డ్ కస్టమర్ల వార్షిక రుసుమును రూ.10,000+ జీఎస్​టీ నుంచి రూ.12,500+జీఎస్​టీకి పెంచింది. అలాగే ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ఇచ్చే రూ.10,000 విలువైన వోచర్లను కూడా నిలిపేసింది. అలాగే సెప్టెంబర్​ 1 నుంచి .. ప్రతి నెలా రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి ఇచ్చే ఎడ్జ్​ రివార్డ్ పాయింట్లను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందుకే యాక్సిస్ క్రెడిట్ కార్డు హోల్డర్లు .. ఈ సరికొత్త రూల్స్​ను రివైజ్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఎస్​బీఐ వీకేర్​ ఎఫ్​డీ గడువు
    SBI WeCare FD For Senior Citizens : ఇది సీనియర్ సిటిజన్స్​ కోసం ప్రత్యేకంగా అందించే స్పెషల్​ ఫిక్స్​డ్ డిపాజిట్​ స్కీమ్​. ఈ ఎస్​బీఐ వీకేర్​ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. ఈ స్కీమ్​లో కొత్తవారు డిపాజిట్స్​ ప్రారంభించవచ్చు. అలాగే ఇప్పటికే స్కీమ్​లో ఉన్నవారు.. దీనిని పునరుద్ధరణ​ కూడా చేసుకోవచ్చు.
  • ఐడీబీఐ అమృత్​ మహోత్సవ్​ ఎఫ్​డీ
    IDBI Amrit Mahotsav FD : ఐడీబీఐ ఈ అమత్​ మహోత్సవ్​ స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​ ద్వారా ఖాతాదారులకు 7.1 శాతం నుంచి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది. ఈ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్లకు.. సాధారణ ఖాతాదారుల కంటే అధిక వడ్డీ లభిస్తుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.