ETV Bharat / bharat

ఈ రాశివారికి అన్ని రంగాల్లో విజయం- వ్యాపారంలో భారీ లాభాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 4:45 AM IST

Horoscope Today December 30th 2023
Horoscope Today December 30th 2023

Horoscope Today December 30th 2023 : డిసెంబర్​ 30న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 30th 2023 : డిసెంబర్​ 30న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) :
ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అనేక విషయాలు ఎదురవుతాయి. ధ్యానం, యోగాభ్యాసం ద్వారా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీ ఇల్లు లేదా ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది.

.

వృషభం (Taurus) :
మీరు రోజంతా తేలికగా, ఆహ్లాదంగా ఉంటారు. మీ హృదయం సానుకూలమైన భావోద్వేగాలతో సంతోషంగా ఉంటుంది. మీరు ఊహల్లో తేలిపోతుంటారు. ప్రేమలో పడిన భావన కలుగుతుంది. ఇది అంతా చాలా అందంగా ఉంటుంది.

.

మిథునం (Gemini) :
ఈ రోజు బంధువులు, మీకు ప్రియమైన వారితో, స్నేహితులతో సరదాగా సంతోషంగా గడుపుతారు. మీకు ఆర్థిక సమస్య ఉంటే ఆలోచించేందుకు సమయం తీసుకుంటారు. రోజు మొదట్లో ఇబ్బంది ఉంటుంది. తర్వాత పరిస్థితులన్నీ సానుకూలంగా మరుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. వృత్తి రంగాల్లో వారికి కూడా ఇది మంచి సమయం. తారాబలం మీకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తుంది.

.

కర్కాటకం (Cancer) :
మీరు ఈ రోజు అనేక ఆశ్చర్యాలు చూస్తారు. స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి నుంచి అవి ఎదురవచ్చు. అందమైన ప్రదేశాల్లో మీ ప్రియమైన వారితో ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఈ రోజు గడుపుతారు.

.

సింహం (Leo) :
ఈ రోజు అనేక ఘటనలు చోటుచేసుకుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలంగా లేని భావోద్వేగాల ప్రభావం మీపై ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. తారాబలం బలహీనంగా ఉంది. వీలైతే వివాదాలకు దూరంగా ఉండండి.

.

కన్య (Virgo) :
కన్యరాశి వారు ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సంపద ప్రాపిస్తుంది. ప్రశాంతమైన ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో మీరు మీ స్నేహితులకు దగ్గరవుతారు. మీ భాగస్వామితో మంచి కెమిస్ట్రీ ఏర్పడుతుంది.

.

తుల (Libra) :
ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ శక్తియుక్తులతో మీరు మీ ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్‌ కోసం చూస్తున్న ఎదురుచూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఉరకలెత్తించే సంతోషం ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది.

.

వృశ్చికం (Scorpio) :
మీరు ఈరోజు చాలా భావోద్వేగంతో ఉంటారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కష్టమైనప్పటికీ అదే మీకు మంచిది. అనుకోని మలుపులు తిరిగే సంఘటనలు ఉండే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిపరమైన విషయాల్లో అధికారులు ఒక్కోసారి సంతృప్తి, ఇంకోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మీరంటే గిట్టని వాళ్లున్నారు. మీ పిల్లలు కూడా మీకు వ్యతిరేకం. ప్రయాణాలుంటాయని ఫలితాలు చెబుతున్నాయి. ఖర్చులు బాగా ఉండవచ్చు.

.

ధనుస్సు (Sagittarius) :
ఊహించని సంఘటనలతో ఈ రోజంతా నిండిపోయి ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకండి. అధిక సున్నితత్వం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు లౌక్యంగా ఉండండి.

.

మకరం (Capricorn) :
వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ఫ్రాంచైజీ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమీషన్‌, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. భారీ లాభాలను మీరు చూడబోతున్నారు. పిల్లల చదవులు కొంత ఆందోళన కలిగిస్తాయి.

.

కుంభం (Aquarius) :
ఈ రోజు మీరు అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ స్టైల్‌, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ మానసికస్థితి ఆలోచనలకు దారితీసేదిగా ఉంటుంది.

.

మీనం (Pisces) :
ఈ రోజు మీ సృజనాత్మకత మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు మీలో ఉన్న చాలా రకాలైన నైపుణ్యాలను వెలికి తీయాలి. ఇక ఒత్తిడి లేకుండా ఉండండి. మీరు రాయడం, చదవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. విద్యార్థుల అధ్యయనం బాగా ఫలిస్తుంది. మీరు కోపం అదుపులో ఉంచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.