ETV Bharat / bharat

హిమాచల్​ ప్రదేశ్​లో పోలింగ్​కు రంగం సిద్ధం

author img

By

Published : Nov 11, 2022, 7:22 PM IST

Himachal Pradesh Election 2022 : హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 68 స్థానాలకు శనివారం పోలింగ్​ జరగనుంది. భాజపా, కాంగ్రెస్​, ఆప్ మధ్య ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది.

himachal pradesh election
హిమాచల్​ప్రదేశ్ ఎన్నికలు

Himachal Pradesh Election 2022 : హిమాచల్‌ ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు రంగం సిద్ధమైంది. శనివారం ఆ రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఓటింగ్​ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

  • మొత్తం ఓటర్లు- 55,07,261
  • పురుష ఓటర్లు- 27,80,208
  • మహిళా ఓటర్లు- 22,27,016
  • తొలిసారి ఓటువేయబోయే యువ ఓటర్లు- 1,86,681
  • పోలింగ్ కేంద్రాలు- 7,881
  • పోలింగ్ తేదీ- నవంబరు 12
  • ఓట్ల లెక్కింపు తేదీ-డిసెంబరు 8

మొత్తం 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 43, కాంగ్రెస్‌ 22 స్థానాలు దక్కించుకున్నాయి.
రాష్ట్రంలో రెండో సారి వరుసగా అధికారంలోకి రావాలని భాజపా తహతహలాడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఆమ్​ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది.

ఇవీ చదవండి: మంచు కొండల్లో మోదీనే బ్రహ్మాస్త్రం.. భారమంతా ఆయనపైనే..!

మంచుకొండల్లో అధికారం చేపట్టాలంటే.. కాంగ్రాపై గురి పెట్టాల్సిందే..!

హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.