ETV Bharat / bharat

బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ - ఒకరు మృతి - సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 1:41 PM IST

Updated : Dec 14, 2023, 8:01 PM IST

Gas Cylinder Blast
Gas Cylinder Blast

Gas Cylinder Blast in Bakery at Rajendranagar Today : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బేకరి యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. వీరిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Gas Cylinder Blast in Bakery at Rajendranagar Today : Gas Cylinder Blast in Bakery at Rajendranagar Today : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీ వంటశాలలో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బేకరీ(Bakery) యాజమాన్యం స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొదట గాయపడిన వారిని శంషాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం డీఆర్​డీవో(DRDO) అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు రాబడుతున్నారు.

'ఉదయం 9గంటల సమయంలో కరాచీ బేకరికి చెందిన వంటశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓవెన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు. అగ్నిప్రమాదం విషయం గోప్యంగా ఉంచిన కరాచీ బేకరీ యాజమాన్యం, అక్కడ ఉన్న వాహనాల్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అగ్నిప్రమాదంపై స్పందించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాజమాన్యం, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి తిరిగి' పోలీసులు వెళ్లిపోయారు.

తెలంగాణ పర్యాటక భవన్​లో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కీలక దస్త్రాలు, కావాలనే!

CM Revanth Response on Bakery Fire Accident : వైద్యఆరోగ్యశాఖ అధికారులు కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రికి వెళ్లి బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కరాచీ బేకరీ(Karachi Bakery)కి హైదరాబాద్ నగరంలో పలు శాఖలు ఉన్నాయి. ఆయా బేకరీలకు బిస్కెట్లు, స్వీట్లు, బ్రెడ్లు, ఇతర తినుబండారాలను తయారు చేయడానికి గగన్‌పహాడ్‌ సమీపంలో భారీ వంటశాల ఏర్పాటు చేశారు.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌కు చెందిన కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనపై జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖాధికారులు వివరాలు సేకరించారు. పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయా లేదా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ గోదాంలో విద్యుతాఘాతం వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

క్షతగాత్రుల వివరాలు : శుభమ్‌, బలరామ్‌, కమల్‌ కిషోర్‌, దారాసింగ్‌, సుజిత్‌, సోను, ఆధిత్య కుమార్‌, ముకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌, ప్రమోద్‌ కుమార్‌, దీపక్‌ శుక్లా, ప్రదీప్‌ కుమార్‌లు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు గుర్తించారు. వీరంతా అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం - రూ.10 కోట్ల ఆస్తి నష్టం

విశాఖ ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

Last Updated :Dec 14, 2023, 8:01 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.