ETV Bharat / bharat

విశాఖ ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 11:58 AM IST

Updated : Dec 14, 2023, 7:45 PM IST

Major_Fire_Accident_in_Visakha_Indus_Hospital
Major_Fire_Accident_in_Visakha_Indus_Hospital

11:56 December 14

రోగులను అంబులెన్స్‌లలో వేరే ఆస్పత్రులకు తరలింపు

విశాఖ ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

Major Fire Accident in Visakha Indus Hospital:
విశాఖ జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం రేపింది. ఆసుపత్రి మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనతో ఆసుపత్రిలోని అన్ని అంతస్తులను దట్టమైన పొగ కమ్మేసింది. ఒక్కసారిగా రోగులంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలో ఉన్న 52 మంది రోగుల్ని చకచకా కిందికి తీసుకొచ్చారు. అక్కడినుంచి అంబులెన్సుల్లో ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇండస్‌ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో ఎవరైనా చిక్కుకున్నారా అని పరిశీలించారు. ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జంబో ఫైర్ టెండర్, 12 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసినట్లు విశాఖ సీపీ తెలిపారు.

Last Updated : Dec 14, 2023, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.