ETV Bharat / bharat

బంగ్లా జాతిపితకు గాంధీ శాంతి బహుమతి

author img

By

Published : Mar 22, 2021, 3:58 PM IST

2019, 2020 సంవత్సరాలకు గాంధీ శాంతి బహుమతి గ్రహీతలను ప్రకటించింది కేంద్రం. 2019 ఏడాదికి ఒమన్ మాజీ సుల్తాన్ కాబూస్ బిన్ సయిద్ అల్ సయిద్​, 2020 ఏడాదికి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్​ను విజేతలుగా ఎంపిక చేసింది.

Gandhi Peace Prize for the year 2020 and 2019 are announced
ముజిబుర్, కాబూస్​లకు గాంధీ శాంతి బహుమతి

2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని.. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్​కు ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019 ఏడాదికి ఈ అవార్డును ఒమన్​ మాజీ సుల్తాన్ దివంగత 'కాబూస్ బిన్ సయిద్ అల్ సయిద్​'కు అందిస్తున్నట్లు తెలిపింది.

1995 నుంచి గాంధీ శాంతి బహుమతులను అందిస్తోంది కేంద్రం. 125వ గాంధీ జయంతి సందర్భంగా ఈ పురస్కారాల ప్రదానం ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.