ETV Bharat / bharat

నదిలో మునిగి నలుగురు పిల్లలు మృతి

author img

By

Published : Nov 9, 2021, 6:24 PM IST

Updated : Nov 9, 2021, 6:45 PM IST

ఝార్ఖండ్​లోని గిరిధ్​ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నదీ స్నానానికని వెళ్లిన నలుగురు పిల్లలు నీట మునిగి మృతిచెందారు. లోతు ఎక్కువగా ఉన్న వైపునకు పిల్లలు వెల్లడం వల్లే ఈ విషాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

jharkhand news latest
నదిలో నీటమునిగి నలుగురు పిల్లలు మృతి

నదీ స్నానం కోసం వెళ్లిన నలుగురు పిల్లలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లోని గిరిధ్​​ జిల్లా మంగ్రోధి గ్రామంలో జరిగింది. మృతుల్లో ముగ్గురు స్థానికులు. మరొ బాలిక వేరే గ్రామానికి చెందినదని.. ఛత్​పూజ జరుపుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

d
ఘటనాస్థలం వద్ద స్థానికులు
d
పిల్లలను ఆసుపత్రికి తరలిస్తున్న స్థానికులు

ఛత్​పూజ నేపథ్యంలో సమీపాన ఉన్న ఉశ్రీ నదిలో సోనౌవ కుమార్​, సోనాక్షి కుమారి, సోహాని కుమారి సహా మరో బాలిక పుణ్యస్నానాలకు వెళ్లారు. ఎంతసేపైనా పిల్లలు తిరిగి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు నదీ తీరానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీట మునిగిన చిన్నారులను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

లోతు ఎక్కువగా ఉన్న చోటకు పిల్లలు వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : ఆరేళ్ల బాలుడిని హత్య చేసిన యువకుడు.. మేడపైకి తీసుకెళ్లి..

Last Updated : Nov 9, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.