ETV Bharat / bharat

దివ్యాంగ కళాకారుడి చిత్రాలకు మోదీ ఫిదా!

author img

By

Published : Apr 18, 2021, 6:38 PM IST

క్లిష్టమైన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే.. ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. జైపుర్​కు చెందిన దివ్యాంగ పెయింటర్​ అజయ్​ గార్గ్​ కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ మోదీ లేఖ రాశారు.

pm narendra modi
ఆత్మవిశ్వాసమే ఆయుధమైతే విజయం నీదే: మోదీ

ఆత్మ విశ్వాసంతో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవటం, సానుకూల ఆలోచనలతో అడ్డంకులను అధిగమించటం ద్వారా ప్రతివ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దివ్యాంగుడైన ఓ పెయింటర్​ గీసిన చిత్రాలను​ చూసిన అనంతరం.. అతణ్ని కొనియాడుతూ మోదీ లేఖ రాశారు.

జైపుర్​కు చెందిన అజయ్​ గార్గ్​.. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం కారణంగా మూగ, చెవిటిగా మారాడు. గార్గ్​ తాను గీసిన ​ఓ చిత్రాన్ని ప్రధాని మోదీకి ఇటీవల పంపగా.. ఆయన స్పందించారు. అజయ్​ గార్గ్ జీవితం​ ఎంతో మందికి స్ఫూర్తిమంతం అని పేర్కొంటూ ఓ లేఖ పంపారు.

"నీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవటం, సానుకూల ఆలోచనలతో అడ్డంకులను అధిగమించటం ద్వారా కొత్త శిఖరాలను అధిరోహించగలం. కళపై మీకు ఉన్న అంకితభావం మీ చిత్రాల్లో ప్రతిబింబిస్తోంది. మీరు ఎంచుకున్న రంగంలో మీ పేరు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది."

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

దివ్యాంగుడైనప్పటికీ.. గార్గ్​ తన బలహీనతలనే బలాలుగా మార్చుకున్నారు. తన అంకిత భావంతో చిత్రకళా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశవిదేశాల్లోనూ​ ఎన్నో చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. గార్గ్​ నైపుణ్యానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు ఎన్నో వరించాయి. తాజాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ప్రశంసించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'అలవట్టం' రూపొందిస్తూ 50 ఏళ్లుగా దైవసేవలో..

ఇదీ చూడండి: మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.