ETV Bharat / bharat

యూపీ నుంచి హిమాలయాల ఫొటోలు తీసిన టీచర్​

author img

By

Published : May 21, 2021, 1:33 PM IST

Updated : May 21, 2021, 2:29 PM IST

చల్లని వాతావారణంలో, రవి అస్తమించే సమయంలో ఫొటోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి వాతావణంలో అందమైన హిమాలయ పర్వత శ్రేణి, గంగోత్రి నదీ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు ఓ టీచర్​.

Himalayas pictures
హిమాలయ పర్వత దృశ్యాలు

సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. అలాంటి వాతావరణంలోనే ఎంతో దూరంలోనున్న హిమాలయాలు, బందర్​పుంచ్​ పర్వత శిఖరాలను ఎంతో అందంగా తన కెమెరాలో బంధించారో వ్యక్తి. అదే గొప్ప అనుకుంటే.. ఆ పర్వత శ్రేణిని కవర్​ చేస్తూ.. గంగోత్రి, యమునోత్రి నది దృశ్యాలనూ అద్భుతంగా తీశారాయన. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన దుష్యంత్​ కుమార్​ తీసిన ఆ చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

Dushyant Kumar, Himalayas pictures
హిమాలయ పర్వత దృశ్యాలు

ఉత్తర భారతదేశంలో కొన్ని రోజులుగా నిత్యం వర్షపాతంతో వాతావారణం చల్లబడిపోయింది. ఈ సమయంలో ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు సన్నద్ధమయ్యారు దుష్యంత్ కుమార్​. అలా గురువారం(మే 20న).. ఉత్తర్​ప్రదేశ్​లోని సహారన్​పుర్​ నుంచి చూస్తే అందమైన హిమాలయ చిత్రాలు అతడి కంటపడగా.. వెంటనే వాటిని క్లిక్​ మనిపించారు.

Dushyant Kumar, Himalayas pictures
హిమాలయ, బందర్​పుంచ్​ పర్వత శ్రేణి.. గంగోత్రి, యమునోత్రి దృశ్యాలు

గతేడాది కూడా..

గతేడాది కూడా ఇలాంటి సమయాల్లో.. ఈ పర్వత శ్రేణి దృశ్యాలు సహారన్​పుర్​(యూపీ) నుంచి ఎంతో అందంగా కనిపించాయంటున్నారు దుష్యంత్​. ఆ దృశ్యాలను ఆస్వాదించడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారాయన.

Dushyant Kumar
దుశ్యంత్​ కుమార్​

ఇదీ చదవండి: కాంగ్రెస్​ టూల్​కిట్ వ్యవహారంపై స్పందించిన ట్విట్టర్

Last Updated :May 21, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.