ETV Bharat / bharat

'పాక్​తో ​సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం'

author img

By

Published : Mar 6, 2021, 10:16 AM IST

Desire normal ties with Pak, all issues should be resolved bilaterally: India
'పాక్​తో ​సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం'

పాకిస్థాన్ సహా ఇతర పొరుగు దేశాలతో​ సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్​ స్పష్టం చేసింది. సమస్యలను శాంతియుత ధోరణిలో పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని భారత్​, పాకిస్థాన్​ సంయుక్త ప్రకటన విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్​ సహా ఇతర పొరుగు దేశాలతో ​ సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ద్వైపాక్షికంగా, శాంతియుత ధోరణిలో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ శుక్రవారం తెలిపారు.

"పాకిస్థాన్​తో సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోంది. భారత్​, పాక్​ మధ్య సమస్యలు ఏమైనా ఉంటే, ద్వైపాక్షికంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇతర ముఖ్య విషయాలపై మా అభిప్రాయం మారదు.''

-- అనురాగ్​ శ్రీ వాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.

భారత్​, పాకిస్థాన్ 2003లో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే.. ఇటీవలి కాలంలో.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, హింస పెరిగిన నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు ఈ అంశంపై గత నెలలో చర్చలు జరిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాలకు తూ.చ. తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి.

ఇదీ చదవండి:నేపాల్‌ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.