ETV Bharat / bharat

సెలవులు ఇవ్వని ఉన్నతాధికారులు.. రెండేళ్ల కొడుకు మృతి.. శవాన్ని భుజాన మోస్తూ స్టేషన్​కు..

author img

By

Published : Jan 12, 2023, 8:47 PM IST

Updated : Jan 12, 2023, 10:17 PM IST

UP cop carries his son body to SSP office
కానిస్టేబుల్​ సోనూ చౌదరి

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చనిపోయిన తన రెండేళ్ల కుమారుడు మృతదేహాన్ని భుజాన వేసుకొని ఓ కానిస్టేబుల్​ ఎస్​ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అబద్దం చెప్పి సెలవు అగడలేదని దానికి సాక్ష్యం.. చనిపోయిన తన కుమారుడే అంటూ తన బాధను వెల్లడిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ కానిస్టేబుల్​ తన కుమారుడు మృతదేహాన్ని తీసుకుని ఎస్​ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తన భార్య, బిడ్డకు ఆరోగ్యం సరిగా లేదని.. వారిని చూసుకోవడానికి లీవ్​కు అప్లై చేసుకున్నాడు. కానీ ఉన్నతాధికారులు కానిస్టేబుల్​కు సెలవులు మంజూరు చేయలేదు. తాను అబద్ధం చెప్పి సెలవులు అడగలేదని.. నిజంగానే సెలవులు అవసరమని మృతదేహన్ని తీకుకువెళ్లి మరీ ఎస్ఎస్పీకి చూపించాడు.

మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌదరి అనే వ్యక్తి ప్రస్తుతం బైద్​పుర్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్య కవిత, రెండేళ్ల కుమారుడు హర్షిత్​తో కలిసి ఏక్తా కాలనీలో నివసిస్తున్నాడు. 'నా భార్యకు డిసెంబర్​ నెలలో ఆపరేషన్​ జరిగింది. అందుకుగాను ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. మాకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వారిద్దరినీ చుసుకోవడానికి నాకు సెలవులు కావాలి' అని సోనూ జనవరి 7వ తేదీన ఎస్​ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారులు మాత్రం సోనూకు లీవ్ మంజూరు చేయలేదు.

UP cop carries his son body to SSP office
హర్షిత్​​ మృతదేహం వద్ద రోధిస్తున్న కానిస్టేబుల్​ కుటుంబసభ్యులు

బుధవారం మధ్యాహ్నం సోనూ ఎప్పటిలానే విధులకు హాజరుకాగా.. అనారోగ్యంతో ఉన్న భార్య ఇంట్లోనే ఉంది. ఇంతలోనే వారి కుమారుడు హర్షిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి నీటి గుంటలో పడిపోయాడు. ఎంతకీ హర్షిత్​ తిరిగి ఇంటికి రాకపోడటం వల్ల బయటకు వెళ్లి వెతకగా.. గుంటలో పడి కనిపించాడు. వెంటనే హర్షిత్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో తనకు సెలవు తనకు ఎంత అవసరమో తెలియజేస్తూ.. కుమారుడు మృతదేహంతో ఎస్​ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు సోనూ. ఎస్​ఎస్పీ కార్యాలయంలోని అధికారులు కానిస్టేబుల్​ను ఓదార్చి తిరిగి ఇంటికి పంపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ కపిల్​దేవ్​ సింగ్​ విచారణకు ఆదేశించారు.

8 ఏళ్ల బాలికపై.. 10 ఏళ్ల బాలుడు అత్యాచారం..
ఉత్తర్​ప్రదేశ్​ భిజ్నోర్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లిన ఓ 8 ఏళ్ల బాలికపై.. 10 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పొలంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా పక్కపొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాధిత బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ట్రైన్​ ఢీకొని ముగ్గురు మృతి..
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో రైలు కిందపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నయాపుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరెఖేడ ఓవర్‌బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరిని సుల్తాన్‌పుర్​ నివాసి జగదీష్ మీనా (35), చెచత్ ప్రాంతానికి చెందిన రతన్‌లాల్ సోనీ (35)గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. అయితే వారి మృత దేహాల చుట్టూ చిన్న ఇనుపు ముక్కలు పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. వారంతా డ్రగ్స్​కు బానిసై ఓవర్‌బ్రిడ్జ్ సమీపంలో నిర్మాణలో ఉన్న ఓ ప్రాంతం నుంచి వాటిని దొంగలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

రైతుపై దాడి చేసిన పులి
కేరళలో ఓ రైతుపై పులి దాడి చేసింది. గురువారం ఉదయం వాయనాడు జిల్లాలోని మనంతవాడి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల థామస్​ అలియాస్​ సాలు అనే రైతు తన పొలానికి వెళ్లాడు. అదే సమయంలో పొలంలో ఒంటరిగా ఉన్న సాలు పై ఓ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సాలును ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పులి నివాస ప్రాంతాల్లోకి వచ్చి దాడిచేసిందని స్థానిక ప్రజలు ఆదోళన చేపట్టారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.. రైతుపై దాడి చేసిన పులి కోసం వేట ప్రారంభించారు.

Last Updated :Jan 12, 2023, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.