ETV Bharat / bharat

ఆటో ఎక్కిన బాలిక కిడ్నాప్​.. ఆపై డ్రగ్స్​ ఇచ్చి సామూహిక అత్యాచారం

author img

By

Published : May 19, 2022, 10:56 AM IST

Minor gang rape
Minor gang rape

Minor Gang Rape In Delhi: ఓ మైనర్​ను కిడ్నాప్​ చేసి అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణ ఘటన దక్షిణ దిల్లీ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పట్టుకోగా.. ఓ బాలనేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు.

Minor Gang Rape In Delhi: 13 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణం దేశ రాజధాని దక్షిణ దిల్లీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిని మోహిత్(20), ఆకాశ్​(19), షారుక్​(20)గా గుర్తించారు. వీరితో పాటు మరో బాలనేరస్థుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ దిల్లీకి చెందిన 13 ఏళ్ల బాలిక ఏప్రిల్​ 24 సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి కూరగాయల కోసం మార్కెట్​కు బయలుదేరింది. శనిబజార్​లో ఆటో ఎక్కిన బాలికను డ్రైవర్​ షారుక్​.. మార్కెట్​కు బదులు ఓఖ్లాకి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులైన ఆకాశ్​, మరో బాలుడిని పిలిచి.. ఆమెకు శీతల పానీయంలో డ్రగ్స్​ కలిపి ఇచ్చారు. తర్వాత ఆమెను టిగ్రీలోని జేజే క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ మరో నిందితుడు సల్మాన్​తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా అక్కడే గడిపిన వారు.. మరుసటి రోజు ఉదయం బాలికను మథురలోని కోసి కలాన్​కు తీసుకువచ్చారు. తర్వాత రోజు దిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారు.

ఏప్రిల్​ 24న వెళ్లిన బాలిక మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఏప్రిల్​ 26న పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మే1న నిందితుల్లో ఒకరిని దక్షిణ దిల్లీలో పట్టుకున్నారు. వారు ప్రయాణించిన ఆటోను కనుగొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారని, మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టామన్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్​లో బ్లాక్ చేశాడని.. ప్రియుడి ఇంటి వద్దే యువతి ఉరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.