అమ్మవారి అవతారాన్ని అంటూ బాలిక వీరంగం.. చెల్లి గొంతు కోసి హత్య

author img

By

Published : Aug 1, 2022, 2:54 PM IST

DOC Title * dasha-mata-vrat-festival-girl-cut-sister-neck-with-a-sword-in-dungarpur

తాను దశ మాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఓ 15 ఏళ్ల బాలిక.. కత్తి చేతపట్టుకుని హల్​​చల్​ చేసింది. ప్రజల్ని చంపేస్తానంటూ బెదిరించింది. చివరకు ఇంట్లో ఉన్న తన చెల్లిను కత్తితో గొంతు కోసి చంపేసింది. రాజస్థాన్​లో డుంగార్పూర్​లో జరిగిందీ ఘటన.

రాజస్థాన్​లోని డుంగార్పూర్​లో విషాదం నెలకొంది. 15 ఏళ్ల బాలిక.. తాను దశ మాత అమ్మవారి అవతారాన్ని అని చెబుతూ కత్తితో వీరంగం సృష్టించింది. ఈ క్రమంలో తన ఏడేళ్ల చెల్లిని గొంతును కత్తితో కోసేసింది. దీంతో అక్కడిక్కడే చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని చిటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని జింజ్వా ఫాలా గ్రామంలో శంకర్​ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో దశ మాత అమ్మావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేస్తున్నాడు. అమ్మవారి రూపం కేవలం రాత్రి సమయంలోనే కనిపిస్తుందంటూ నమ్మే ఆ గ్రామ ప్రజలు.. ప్రతిరోజు రాత్రి సమయంలోనే దర్శనం చేసుకుంటారు. అలాగే ఆదివారం రాత్రి కూడా 8 గంటలకు గ్రామస్థులు వచ్చి.. అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

అదే సమయంలో శంకర్​ కుమార్తె.. అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న కత్తిని తీసుకుని హల్​చల్​ చేసింది. తాను అమ్మవారి అవతారం అని.. అందర్నీ చంపేస్తానంటూ బెదిరించింది. ఇంటి ఆవరణలో కత్తి పట్టుకుని అటు ఇటు పరిగెత్తింది. ఆమెను పట్టుకునేందుకు శంకర్​తో పాటు అతడి అన్నయ్య సురేశ్​ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారిని కూడా ఆమె గాయపరిచింది. దీంతో ఒక్కసారి శంకర్​ కుటుంబసభ్యులంతా పరుగులు తీశారు.

సురేశ్​ కుమార్తె పుష్ప(7) మాత్రం ఇంట్లోనే నిద్రిస్తోంది. అక్కడికి వెళ్లిన శంకర్​ కుమార్తె కత్తితో పుష్పను గొంతు కోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పలు మార్లు పొడిచింది. దీంతో అక్కడిక్కడే ఆమె చనిపోయింది. కాసేపటికి శంకర్​ కుటుంబసభ్యులంతా వచ్చి చూసేసరికి పుష్ప విగతజీవిగా కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..

ఘోరం.. కరెంట్​ షాక్​తో 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.