ETV Bharat / bharat

Covid Cases in India: దేశంలో 7వేల దిగువకు కరోనా కేసులు

author img

By

Published : Mar 3, 2022, 8:58 AM IST

Updated : Mar 3, 2022, 10:27 AM IST

Covid Cases in India: దేశంలో కొత్తగా 6,561 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,938,599కు చేరింది. మరోవైపు వ్యాక్సినేషన్​లో భాగంగా బుధవారం 21,83,976 డోసులు పంపిణీ చేశారు.

corona cases in india
దేశంలో కరోనా కేసులు

Corona cases in India: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,561 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 14,947 మంది కోలుకోగా.. 142 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 77,152గా ఉంది.

  • మొత్తం కేసులు: 42,938,599
  • మొత్తం మరణాలు: 5,14,388
  • యాక్టివ్​ కేసులు: 77,152
  • కోలుకున్నవారు: 4,23,53,620

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 21,83,976 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,02,63,222కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా 15,78,230 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,402,74,905కు చేరింది. కొత్తగా 7733 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 5,992,271కు చేరుకుంది. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య 19,07,368గా ఉంది.

  • జర్మనీలో కొత్తగా 1,98,457 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 255 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 49,729 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,778 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 97,455 కరోనా కేసులు నమోదయ్యాయి. 784 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 30,995 మందికి వైరస్​ సోకగా.. 335 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​లో 57697 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ధాటికి మరో 186 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : 200 మంది భారతీయులతో స్వదేశానికి సీ-17 ఎయిర్​క్రాఫ్ట్​

Last Updated : Mar 3, 2022, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.