ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మళ్లీ 20వేలపైకి

author img

By

Published : Jul 20, 2022, 10:38 AM IST

Covid Cases In India
Covid Cases In India

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 20,557 మంది వైరస్​ బారినపడగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,517 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది.

  • మొత్తం కేసులు : 4,38,03,619
  • మొత్తం మరణాలు: 5,28,388
  • యాక్టివ్​ కేసులు: 1,43,091
  • కోలుకున్నవారి సంఖ్య: 4,31,32,140

Vaccination India: భారత్​లో మంగళవారం 26,04,797 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.61 కోట్లు దాటింది. మరో 4,98,034 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,68,111మంది వైరస్​ బారినపడగా.. మరో 1,744 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,95,70,280కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,91,609 మంది మరణించారు. ఒక్కరోజే 9,05,601మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,06,81,331కు చేరింది.

  • జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 1,40,999 మందికి వైరస్ సోకింది. 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 1,34,188 మందికి కరోనా సోకింది. 144 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 1,20,683 మందికి వైరస్​ సోకగా.. 176 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 73,537 మందికి వైరస్​ సోకగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆమెరికాలో 75,397 కేసులు నమోదు కాగా.. 299 మంది మరణించారు.

ఇవీ చూడండి : మరో సిపాయిల తిరుగుబాటుకు బాటలు వేసిన 'పిగ్ రూపాయి'

త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు ఖాళీ.. వెల్లడించిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.