త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు ఖాళీ.. వెల్లడించిన కేంద్రం

author img

By

Published : Jul 20, 2022, 4:29 AM IST

త్రివిధ

Armed forces: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.

Armed forces: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్లు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు.

రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సగటు నియామకాల సంఖ్య.. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే ఎక్కువగా ఉందా? అలా అయితే, సాయుధ దళాల్లో సిబ్బంది కొరతను ఎలా తీరుస్తారు? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం దాటవేసిన ఆయన.. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని బదులిచ్చారు.

ఆఫీసర్, నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతపై భట్ వివరణ ఇచ్చారు. అధికారికంగా ఉండాల్సిన సంఖ్యతో పోలిస్తే జనవరి 1 నాటికి సైన్యంలో 1,16,464 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు చెప్పారు. అదే 2020 జనవరిలో సైన్యంలో 64,482 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు నావికాదళంలో ఈ ఏడాది మే నాటికి 13,597 పోస్టులు ఖాళీగా ఉండగా.. జులై 1 నాటికి వైమానిక దళంలో 5,723 ఖాళీలు ఉన్నట్లుగా వివరించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. త్రివిధ దళాలు ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నాయి. ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించాయి.

ఇవీ చదవండి: తెగిన పేగు బంధం.. కుమారుడికి తల్లి అంత్యక్రియలు.. బోరున విలపిస్తూనే..

చిన్నారిపై ఆరేళ్లుగా తండ్రి, బాబాయి రేప్.. భవనం పైనుంచి దూకేసిన బాలిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.