ETV Bharat / bharat

భారత్​లో దిగొస్తున్న కరోనా కేసులు.. జర్మనీ, జపాన్​లో ఉగ్రరూపం

author img

By

Published : Jul 19, 2022, 9:40 AM IST

covid cases in india
దేశంలో కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 15,528 మంది వైరస్ బారిన పడగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 15,528 మంది వైరస్​ బారినపడగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,113 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు : 4,37,83,062
  • మొత్తం మరణాలు: 5,25,785
  • యాక్టివ్​ కేసులు: 1,43,654
  • కోలుకున్నవారి సంఖ్య: 4,31,13,623

Vaccination India: భారత్​లో సోమవారం 27,78,013 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.5 కోట్లు దాటింది. మరో 4,68,350 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 6,37,016 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,128 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,84,50,463కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,89,332 మంది మరణించారు. ఒక్కరోజే 8,91,562 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,96,37,997కు చేరింది.

  • జర్మనీలో కొత్తగా 1,60,691 మందికి వైరస్ సోకింది. 102 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో కొత్తగా 1,03,602 మందికి కరోనా సోకింది. మహమ్మారితో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో కొత్తగా 58,177 మందికి వైరస్​ సోకగా.. 149 మంది మరణించారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 39,106 మందికి వైరస్​ సోకగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 38,697 కేసులు నమోదు కాగా.. 143 మంది మరణించారు.

ఇవీ చూడండి : రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. ముర్ముకే జై!

నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.