ETV Bharat / bharat

'కొవిడ్​ కేసులు తగ్గుతున్నా.. అప్రమత్తంగానే ఉండాలి'

author img

By

Published : Jan 29, 2022, 10:48 PM IST

Mansukh Mandaviya
ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా

Covid cases in eastern states: దేశంలోని ఐదు తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో కొవిడ్​ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ. గత రెండు వారాలుగా కొవిడ్​ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ.. అప్రమత్తంగానే ఉండాలని సూచించారు.

Covid cases in eastern states: గడిచిన రెండు వారాలుగా పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు, కొవిడ్​ యాక్టివ్​ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ. రక్షణ కవచాలను విస్మరించొద్దని సూచించారు. ఐదు ఈశాన్య రాష్ట్రాలతో కరోనా పరిస్థితులపై సమీక్షించారు కేంద్ర మంత్రి.

ఒడిశా, బిహార్​, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​, బంగాల్​ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సమాచార కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటును పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు మాండవీయ. ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు పెంచాలని స్పష్టం చేశారు.

" గత రెండు వారాలుగా కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అప్రమత్తంగానే ఉండాలి. ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, మరణాలను నిశితంగా పరిశీలించాలి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, ఆక్సిజన్​ సపోర్ట్​ అవసరమైనవారు, మరణాల్లో టీకా తీసుకున్నవారు, టీకా తీసుకోనివారు ఎంత మంది ఉన్నారన్న వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలి."

- మన్​సుఖ్​ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

కొవిడ్​ వేరియంట్లతో సంబంధం లేకుండా రాష్ట్రాల్లో కొవిడ్​ పరీక్షలు, కేసుల గుర్తింపు, చికిత్సలు, వ్యాక్సినేషన్​, కొవిడ్​ నిబంధనలు పాటించటంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మాండవీయ. ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈసీఆర్​పీ-2 నిధులను వినియోగించుకోవాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మరో 50వేల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.