ETV Bharat / bharat

Pregnant women: 'గర్భిణుల్లో కొవిడ్‌ ఇన్ఫెక్షన్​ ముప్పు ఎక్కువే!'

author img

By

Published : Sep 17, 2021, 8:25 AM IST

Updated : Sep 17, 2021, 8:30 AM IST

కరోనా
కొవిడ్

గర్భిణులపై కరోనా (Pregnant women covid) చూపించే ప్రభావం ఎక్కువేనని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌ బారిన పడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పరిశోధనలో గుర్తించింది. మహమ్మారి సోకిన గర్భిణులకు తక్షణ వైద్య సహాయం అవసరమని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో(Pregnant women covid) ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో అధ్యయనం జరిపింది. ఆ రాష్ట్రంలోని పలు ఇన్సిస్టిట్యూట్‌లు, ఆసుపత్రుల సహకారంతో ఐసీఎంఆర్‌ మొదటిసారిగా సమగ్ర అధ్యయనం జరిపింది. మహారాష్ట్రలో కొవిడ్‌ సోకిన గర్భిణులు(Pregnant women covid), బాలింతలపై సేకరించిన సమాచారంతో ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4,203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. మొత్తంగా చూస్తే.. 3,213 జననాలు, 77 గర్భస్రావాలు నమోదయ్యాయి. మొత్తం 528 మందికి ముందస్తు ప్రసవం అయింది. 328 మందిలో రక్తపోటు సమస్యలు తలెత్తాయి. పిండ విచ్ఛిత్తి, మృత శిశువుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉంది.

534 మందిలో లక్షణాలు..

మొత్తం గర్భిణుల్లో(Pregnant women covid) 534 మంది సింప్టమెటిక్‌గా తేలారు. వీరిలో 382 మందిలో తేలికపాటి, 112 మందిలో మధ్యస్థ, 40 మందిలో తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. మొత్తంగా 158 మంది గర్భిణులు, బాలింతలకు ఇంటెన్సివ్ కేర్ వైద్యం అవసరం అయింది. వీరిలో 152 మందికి కొవిడ్‌ సంబంధిత సమస్యలే కారణమయ్యాయి. మొత్తం మరణాల రేటు 0.8 శాతం(34/4203)గా నమోదైంది. పుణెలో(9/853, 1.1 శాతం), మరాఠ్వాడా(4/351, 1.1 శాతం) ప్రాంతాల్లో అధిక మరణాలు సంభవించాయి. 'గర్భిణుల్లో వైరస్‌ లక్షణాలు కనిపించినప్పడు.. అవి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మహమ్మారి సోకిన గర్భిణులకు తక్షణ వైద్య సహాయం అవసరమ'ని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 17, 2021, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.