ETV Bharat / bharat

'కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా తగ్గలేదు'

author img

By

Published : Jun 28, 2021, 9:43 PM IST

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా తగ్గలేదని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ బలరాం భార్గవ తెలిపారు. కొవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే దేశానికి మరో సవాలు తప్పదని హెచ్చరించారు. మరోవైపు.. కొవిడ్​ టీకా పంపిణీలో అమెరికాను అధిగమించి భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.

corona second wave in india
దేశంలో కరోనా రెెెండో దశ

కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్షం వహిస్తే దేశానికి మరో పెను సవాలు తప్పదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​)​ డైరెక్టర్​ జనరల్​ బలరాం భార్గవ హెచ్చరించారు. దేశంలో కరోనా రెండో దశ సమస్య ఇంకా సమసిపోలేదని తెలిపారు. దేశంలోని ఇంకా 80 జిల్లాల్లో వైరస్​ పాజిటివిటీ రేటు అధికంగానే ఉందని పేర్కొన్నారు. భారత్​లో తయారైన వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నాయని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్(జీఓఎం)​ 29వ సమావేశంలో ఆయన మాట్లాడారు.

"మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బంగాల్​, ఒడిశాలో కరోనా కేసుల తీవ్రత అధికంగానే ఉంది. ఆయా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే అధికంగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే దేశం పెద్ద సమస్యతో పోరాడాల్సి వస్తుంది.

- బలరాం భార్గవ, ఐసీఎంఆర్​ డైరెక్టర్​

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో రోజువారీ మరణాలు దాటుతున్నాయని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్​సీడీసీ) డైరెక్టర్​ డాక్టర్​ సుర్జీత్​ సింగ్.. జీఓఎం సమావేశంలో తెలిపారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40,845 మ్యూకర్​మైకోసిస్​ కేసులు వెలుగు చూశాయని జీఓం సమావేశంలో పాల్గొన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 3,129 మంది మరణించారని చెప్పారు. దేశంలో కొనసాగుతున్న టీకా పంపిణీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

"కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భారత్​ మరో మైలురాయిని దాటింది. అమెరికా కంటే అధిక సంఖ్యలో కొవిడ్ టీకాలను వేసింది. ఇప్పటివరకు 32.36 కోట్ల టీకా డోసులు.. భారత్​లో పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

అమెరికాలో 32.33 కోట్ల టీకా డోసులను పంపిణీ చేయగా.. బ్రిటన్​లో 7.67 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగిందని హర్షవర్ధన్ వివరించారు.

ఇదీ చూడండి: దేశంలో మరో 46,148 మందికి కరోనా

ఇదీ చూడండి: 'కాకులు, కొంగలు తింటాం.. మాకు టీకా వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.