ETV Bharat / bharat

Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!

author img

By

Published : Aug 15, 2023, 4:58 PM IST

Costliest MBBSS Colleges In India
Costliest MBBSS Colleges In India

Costliest MBBS Colleges In India : దేశంలో వైద్య విద్య ఫీజులు ఏటేటా ఆకాశాన్నంటుతున్నాయి. కోర్సు పూర్తయ్యే సరికి కొన్ని కళాశాలల్లో రూ.కోట్లలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు రకరకాల పేర్లతో అడ్మిషన్​ ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓ కాలేజీ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎంబీబీఎస్​ డిగ్రీ అందిస్తోంది. ఆ వైద్య కళాశాల ఎక్కడ ఉందంటే?

Costliest MBBS Colleges In India : మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఉన్న డీవై పాటిల్ మెడికల్ కాలేజీ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎంబీబీఎస్​ డిగ్రీని అందిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల వైద్య విద్య డిగ్రీకి ఏడాదికి రూ.30.5 లక్షలు ఫీజును వసూలు చేస్తోంది. అలా కోర్సు పూర్తయ్యే సరికి విద్యార్థులు రూ.1.35 కోట్లు కట్టాల్సివస్తోంది. దీనికి తోడు కాలేజీలో చేరేటప్పుడు అడ్మిషన్​ ఫీజు కింద రూ.2.84 లక్షలు వసూలు చేస్తోంది. ఇలా అత్యధిక పీజులు వసూలు చేసే కాలేజీల జాబితాలో డీవై పాటిల్ గ్రూపునకు చెందిన మరో కళాశాల కూడా ఉంది. ఈ కాలేజీలో ఏడాదికి రూ. 29.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 26.84 లక్షల ఫీజుతో భారతీయ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ, పుణె తర్వాతి స్థానంలో ఉంది.

అయితే, ఇలాంటి కాలేజీలు అధికంగా తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. చెన్నైలోని శ్రీమాచంద్ర మెడికల్ కాలేజీలో ఏడాదికి రూ. 28.13 లక్షలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో చెన్నైలోనే ఉన్న ఎస్​ఆర్​ఎమ్​ మెడికల్ కాలేజీ ఉంది. అయితే, ట్యూషన్​ ఫీజు, హాస్టల్​ ఖర్చులు తదిరాలకు కలిపి ఈ ఫీజు ఉంటుంది. కొన్ని కాలేజీలు యూనివర్సిటీ ఫీజు, రిఫండబుల్ డిపాజిట్లు, కాషన్​ మనీ అని రకరకాల పేర్లతో అడ్మిషన్​ ఫీజు వసూలు చేస్తాయి. ఇలాంటి ఫీజుల మొత్తం లక్షల్లో ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.

ఇక కొన్ని ప్రైవేటు కళాశాలలు.. వసతి, ఇతర డిపాజిట్లు కాకుండా సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఫీజు ఉంటున్నాయి. వీటితో పోల్చితే దిల్లీ సహా ఉత్తర భారతంలో ఫీజులు కొంచెం తక్కువగా ఉంటాయి. గాజియాబాద్​లోని సంతోశ్​ మెడికల్​ కాలేజీలో హాస్టల్​ రుసుముతో కలిపి ఏడాదికి రూ.26 లక్షలు తీసుకుంటారు. అయితే, ఈ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు పూర్తి విరుద్ధంగా మహారాష్ట్రలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు వైద్య డిగ్రీని అందిస్తున్నాయి. ఈ కాలేజీలు ఏడాదికి రూ.1.3 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయి.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు రూ. 50 వేలకు మించవు. ఇక, ప్రవేటు, డీమ్డ్​ కాలేజీలు కూడా తమ కళాశాలల్లో ఉన్న 50 శాతం సీట్ల ఫీజులను ఆయా రాష్ట్రల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న ఫీజులతో సమానంగా తీసుకోవాలని సూచిస్తూ 2022 ఫిబ్రవరిలో నేషనల్​ మెడికల్ కమిషన్- ఎన్​ఎమ్​సీ గెజిట్ జారీ చేసింది. అయితే ఈ గెజిట్ ఇంకా అమలు కాలేదు.

నారాయణ కళాశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

చదువులో మెరికలు.. విద్యార్థులకు ఫీజుల తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.