ETV Bharat / bharat

'కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధనలు తప్పనిసరి'​

author img

By

Published : Nov 29, 2020, 11:48 AM IST

Corona vaccine for 30 crore in India by July 2021
'కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధన తప్పనిసరి'

వచ్చే ఏడాది జులై ఆఖరు నాటికి సుమారు 30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్​ ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ అన్నారు. కొవిడ్​ టీకా అందుబాటులోకి వచ్చినా.. మాస్క్​, భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

2020 జులైలోగా 30 కోట్ల మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) తెలిపింది. లఖ్‌నవూలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ సెమినార్‌లో పాల్గొన్న సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బలరాం భార్గవ.. దేశంలో కరోనా టీకాకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా.. మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు భార్గవ.

మాస్క్‌ అనేది వస్త్రరూపంలోని వ్యాక్సిన్‌

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ దిశగా భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోందన్నారు ప్రొఫెసర్​. దేశవ్యాప్తంగా 19 సంస్థలకు చెందిన 24 తయారీ యూనిట్లు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీలో భాగం కానున్నాయని వెల్లడించారు. అయితే.. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ మాత్రమే సరిపోదని.. నిపుణులు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మహమ్మారి వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య నిబంధనలు కొనసాగుతాయని చెప్పారు భార్గవ. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మాస్క్‌ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మాస్క్‌ అనేది వస్త్రరూపంలో ఉన్న వ్యాక్సిన్‌ అని ఉదహరించారు.

ప్రయోగదశలో..

ప్రస్తుతం స్థానికంగా అభివృద్ధి చేస్తున్న రెండింటితో సహా.. భారత్‌లో మొత్తం ఐదు సంస్థల కరోనా వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు కొనసాగుతున్నాయని డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. భారత్‌ కేవలం తనకోసం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60 శాతానికి కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: 'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.