ETV Bharat / bharat

"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 7:17 AM IST

cbn_pawan_in_cec_meeting
cbn_pawan_in_cec_meeting

CBN Pawan in CEC Meeting: ఏపీలో రానున్న ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ జనసేన కోరాయి. అందులో ఓటరు జాబితాలో అవకవతకలకు కారణమైన దోషులను శిక్షించాలని సీఈసీని కోరాయి. సచివాలయ ఉద్యోగులందరూ వైఎస్సార్​సీపీకి అనుకూలంగా ఉన్నారని వారు ఎన్నికల విధులు నిర్వహిస్తే ఆ ప్రక్రియ నిష్పాక్షపాతంగా ఉండదని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో గంపగుత్తగా ఓట్ల తొలగింపుపై సీఈవోను సంప్రదించిస్తే చర్యల నివేదిక సరిగా లేదని సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.

"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"

CBN Pawan in CEC Meeting: ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల పక్రియలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడటంతో పాటు పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించే తీరుపై ప్రధానంగా దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు, ఎస్పీలు, ఈఆర్వోలపైన విచారణ చేసి బదిలీ చేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల వారిని తప్పుడు కేసుల్లో ఇరికించే పోలీసులపై దృష్టి పెట్టడంతో పాటు, కేంద్ర పోలీసు పరిశీలకులతో సెల్‌ ఏర్పాటు చేయాలని ఈసీకి రాసిన లేఖలో సూచించారు.

దోషులను శిక్షించాలి: ఏపీ తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులందరిపైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడంతోపాటు ఛార్జిషీట్లు వేసి దోషులను శిక్షించాలని తెలుగుదేశం, జనసేన కోరాయి. కేంద్ర పోలీసు పరిశీలకుల ద్వారా రాష్ట్రస్థాయిలో ఎన్నికల పర్యవేక్షణతోపాటు, ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక పోలీసు పరిశీలకుల్ని నియమించి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశాయి.

ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఉక్కు పిడికిలి బిగించాలి : శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ముందుగానే కేంద్ర బలగాలను మోహరించాలని టీడీపీ జనసేన సూచించాయి. మంత్రులు, ఎంపీలు, ఇతరులు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా లేఖకు జత చేసి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు నివేదిక లేఖను ఇరుపార్టీల నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ అందజేశారు. ఆంధ్రప్రదేశ్​ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కు పిడికిలి బిగించాలని కోరారు.

ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు

తుపాకులు గురిపెట్టి నామినేషన్లు​ విత్​డ్రా : అధికార పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం నాయకుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్న పోలీసులపై దృష్టి పెట్టాలని లేఖలో ఇరుపార్టీల అధినేతలు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాలకపక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు.

నామినేషన్లు వేసిన వారిని పోలీస్‌స్టేషన్లకు ఈడ్చుకుపోయి, పోలీసులే తుపాకి గురిపెట్టి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించటంతో పాటు నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు.

బదిలీల జిమ్మిక్కులు : స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తగినన్ని కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులను తమకు కావాల్సిన స్థానాల్లో నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేయలేదని చూపించేందుకు మూడేళ్లకు ముందే బదిలీ చేసినట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యలో పనిచేయలేదని చూపించి మళ్లీ అదే పాత స్థానాలకు తెస్తున్నారని వివరించారు. ఇలాంటి వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం సునిశిత సమీక్ష చేయాలని కోరారు.

రా కదలి రా సభ వాయిదా - సీఈసీ బృందాన్ని కలవనున్న బాబు, పవన్

మద్యం లావాదేవీలను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోవాలి: ఏపీలో మద్యం వ్యాపారాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా హోల్‌సేల్, రిటైల్‌ పంపిణీని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వమే నిర్వహిస్తోందని టీడీపీ -జనసేన అధినేతలు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్లారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో అమ్మకాలు చేయిస్తోందని ఆరోపించారు.

అంతా నగదు లావాదేవీల్లోనే జరుగుతుందని, ఎన్నికల సమయంలో సంబంధిత ఉద్యోగులతో మద్యం పంపిణీ చేసి ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉందని వివరించారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే మద్యం ఉత్పత్తి స్థానం నుంచి రిటైల్‌ దుకాణాలకు చేరే వరకు మద్యం తరలింపు, అన్ని లావాదేవీలను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోవాలని సూచించారు.

విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?

సచివాలయ ఉద్యోగులు ఎన్నికల పక్రియకు హాని: సచివాలయ ఉద్యోగులంతా వైఎస్సార్​సీపీ మద్దతుదారులే అని మంత్రులే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్​సీపీ చెప్పినట్లు వీరంతా చేస్తున్నారని ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిశీలనలోనూ వీరి వైఫల్యం బయటపడిందన్నారు. సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఎలాంటి హోదాలో నియమించినా అది నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు హాని కలిగిస్తుందన్నారు.

సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి మినహాయించాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, వివిధశాఖల ప్రభుత్వ అధికారులే ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది బాధ్యతలను నిర్వహిస్తుంటే, వైఎస్సార్​సీపీ రహస్య ప్రణాళిక అమల్లో భాగంగానే ప్రభుత్వం వీరిని కావాలనే ఎన్నికలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి- తొలిరోజు సమీక్షలో అధికారులతో సుదీర్ఘ చర్చ

వారు ఎన్నికల నిర్వహణకు పెనుముప్పు : ఏపీలో 90శాతం వాలంటీర్లు వైఎస్సార్​సీపీ విధేయులే అని ఆ పార్టీ ఎంపీ స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లోనూ వీరు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పెనుముప్పుగా మారే వీరిని రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే తీరునే క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలను వర్తింపజేయాలని కోరారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే 2 వేల 552 మంది మహిళా పోలీసుల్ని బీఎల్వోలుగా నియమించడాన్ని తప్పుబట్టారు. SPOT

గతంలో ఫిర్యాదుకు సీఈవో చర్యల నివేదిక సరిగా లేదు : పది లక్షల 32 వేల దరఖాస్తులను పరిశీలించకుండానే ముసాయిదా ఓటరు జాబితాలను ప్రచురించారన్న చంద్రబాబు, పవన్‌ గుంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులను ఆమోదించారన్నారు. గుంపగుత్తగా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. డిసెంబరు 22, 23 తేదీల్లో ఏపీకి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వినతిపత్రం ఇచ్చామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన చర్యల నివేదిక సరిగా లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే సరిపోదని గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులపై సరిగా విచారించలేదని తెలిపారు. విచారణ పూర్తి చేసి, ఛార్జిషీటు నమోదు చేసి దోషులను శిక్షిస్తేనే అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు.

ఎన్నికల నగారా మోగే నాటికే స‌మ‌గ్ర ప్రణాళిక‌తో సిద్ధంగా ఉండాలి : సీఈసీ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.