ETV Bharat / bharat

'సీఏ, సీఎస్ అర్హత ఇక పీజీతో సమానం'

author img

By

Published : Mar 16, 2021, 6:48 AM IST

CA, CS, ICWA qualifications equivalent to PG degree: UGC
'సీఏ, సీఎస్ అర్హత ఇక పీజీతో సమానం'

సీఏ, ఐసీడబ్యూఏ, సీఎస్​ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారిని పీజీలుగా గుర్తిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్(ఐసీఎస్ఐ) నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఛార్టర్డ్ అకౌంటెట్(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్​), కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్‌(ఐసీడబ్యూఏ)కు అర్హత సాధించిన విద్యార్థులను పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించిన విద్యార్థులతో సమానంగా పరిగణిస్తామని యూజీసీ ప్రకటించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్(ఐసీఎస్ఐ) నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

యూజీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో సీఎస్ వృత్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ పేర్కొంది. యూజీసీ నిర్ణయాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సైతం ఆహ్వానించింది.

ఇదీ చదవండి : టీషర్ట్‌లో ఎమ్మెల్యే.. బయటకు పంపిన స్పీకర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.