ETV Bharat / bharat

మూఢనమ్మకాలకు 11 ఏళ్ల బాలిక బలి- తండ్రి, మత గురువు అరెస్ట్​

author img

By

Published : Nov 3, 2021, 2:16 PM IST

మూఢనమ్మకాలతో 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడో తండ్రి. ప్రార్థనలు, క్షుద్రపూజలతో(black magic in kerala) రోగం నయమవుతుందని నమ్మాడు. బాలిక మృతికి కారణమైన తండ్రి, మత గురువును పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన కేరళ, కన్నూర్​లో జరిగింది.

Black magic
బాలిక మృతి, బ్లాక్​ మ్యాజిక్​

ఎంతటి రోగాన్నైనా నయం చేయగల స్థాయికి వైద్య రంగం అభివృద్ధి చెందినప్పటికీ.. నేటికీ కొందరు మూఢనమ్మకాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. ప్రార్థనలు, మంత్రాలతో(black magic in kerala) నయమవుతుందని నమ్మి ఆ బాలిక మృతికి కారణమయ్యాడో తండ్రి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్​లో జరిగింది.

ఏమైందంటే?

కన్నూర్​కు చెందిన ఎంఏ సత్తార్​ అనే వ్యక్తి కుమార్తె ఫాతిమా(11) కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైంది. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మత గురువు ఉవాయిస్​ దగ్గరికి తీసుకెళ్లాడు. మతపరమైన ప్రార్థనలు, క్షుద్రపూజలతో(black magic in kerala) నయం చేయాలని కోరాడు. అయితే.. సరైన సమయంలో చికిత్స అందక ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Black magic
అనారోగ్యంతో మృతి చెందిన ఎంఏ ఫాతిమా

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సత్తార్​తో పాటు మత గురువును అరెస్ట్​ చేశారు. జువెనైల్ జస్టిస్​ యాక్ట్​ ప్రకారం వారిపై కేసు నమోదు చేశారు.

బాలిక తీవ్రమైన శ్వాసకోస వ్యాధితో బాధపడుతోందని, సరైన సమయంలో ఆసుపత్రిలో చికిత్స అందించి ఉంటే బతికేదని పోస్ట్​మార్టం నివేదికలో తేలింది.

ఇదే విధంగా గతంలోనూ సరైన వైద్యం అందక నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు తెలిపారు స్థానికులు. వారి ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సత్తార్​ కుటుంబంతో పాటు సంబంధం ఉన్న వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి: సంతానం కోసం ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.