ETV Bharat / bharat

వృద్ధురాలికి క్యాన్సర్​.. 60% లివర్ తొలగించిన వైద్యులు

author img

By

Published : Feb 28, 2022, 1:12 PM IST

రజియా ఖతూన్​
bihar patna lady

ఓ వృద్ధురాలికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశారు బిహార్​ వెద్యులు. పిత్తాశయ క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె కాలేయంలో 60శాతానికి పైగా భాగాన్ని తొలగించి ప్రాణాలు కాపాడారు.

బిహార్​ రాజధాని పట్నాలోని పరాస్​ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్​ను విజయవంతంగా చేసి ఓ వృద్ధురాలి ప్రాణాలను కాపాడారు. పిత్తాశయ క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె కాలేయంలో 60 శాతానికి పైగా భాగాన్ని తొలగించారు.

మోతిహారీ బిహార్‌కు చెందిన రజియా ఖాతూన్‌కు కొన్నాళ్ల క్రితం పిత్తాశయ క్యాన్సర్‌ సోకిందని పరాస్​ ఆసుపత్రి వైద్యుడు నితిన్ కుమార్ తెలిపారు. దీంతో ఆమె కాలేయం కుడి వైపు రక్త సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.

rajia kathun
రజియా ఖతూన్​

"రజియా ఖతూన్​కు చికిత్స చేయడానికి క్లిష్ట సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆమెకు కామెర్ల లక్షణాలు ఉండడం వల్ల చికిత్స చేయడం చాలా కష్టమైంది. అందుకే మొదట కామెర్లు తగ్గడానికి చికిత్స అందించాం. ఆ తర్వాత బయెప్సీ పరీక్ష ద్వారా క్యాన్సర్​ స్థాయిని గుర్తించాం. నాలుగు విడతల్లో కీమోథెరపీ చేశాం. అది పూర్తయ్యాక ఆరు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి 60 శాతానికిపైగా కాలేయ భాగాన్ని తొలగించి ప్రాణాలు కాపాడాం."

- నితిన్​కుమార్​​, వైద్యుడు

రజియా ఖతూన్​ త్వరగా కోలుకుంటున్నారని, తొలగించిన కాలేయ భాగాన్ని తిరిగి అతి త్వరలోనే పొందుతారని వైద్యులు భావిస్తున్నారు. బిహార్​లో కాలేయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండి: మెట్రోస్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న బాలిక.. అంతలోనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.