ETV Bharat / bharat

'చైనా పేరు చెప్పేందుకు కూడా ప్రధానికి ధైర్యం లేదు'

author img

By

Published : Aug 6, 2020, 7:35 PM IST

తూర్పు లద్ధాఖ్​లో చైనా అతిక్రమణలపై రక్షణశాఖ అధికారిక వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేసిన పత్రాలను తొలగించటంపై కాంగ్రెస్​ ఘాటుగా స్పందించింది. పత్రాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు రాహుల్​ గాంధీ. ఆ ఫైల్స్​ డిలీట్ చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని విమర్శించారు.

Chinese 'transgressions' at LAC, asks Congress
'చైనా పేరు చెప్పేందుకు కూడా ప్రధానికి ధైర్యం లేదు'

తూర్పు లద్దాఖ్​లో చైనా చొరబాట్ల వ్యవహారంలో కేంద్రంపై మరోమారు విమర్శలు చేసింది కాంగ్రెస్​. చైనా అతిక్రమణలు నిజమేనన్న నివేదికలను రక్షణ శాఖ తమ వెబ్​సైట్​ నుంచి తొలగించటాన్ని తప్పుబట్టింది. వెబ్​సైట్​ నుంచి పత్రాలను తీసేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

మే నెలలో తూర్పు లద్దాఖ్​లోని వివిధ ప్రాంతాల్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడినట్లు రక్షణ శాఖ అధికారికంగా అంగీకరించింది. జూన్​ నెలలో తమ కార్యకలాపాలకు సంబంధించి వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే.. మీడియాలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో గురువారం ఆ పత్రాలను తొలగించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ఘాటుగా స్పందించింది.

  • Forget standing up to China, India’s PM lacks the courage even to name them.

    Denying China is in our territory and removing documents from websites won’t change the facts.https://t.co/oQuxn77FRs

    — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" చైనాను ఎదుర్కోవడం కాదు కదా.. కనీసం వారి పేరు చెప్పేందుకు కూడా భారత ప్రధానికి ధైర్యం లేదు. మన భూభాగంలోకి చైనా చొరబడలేదని పదేపదే చెబుతూ.. వెబ్​సైట్​ నుంచి పత్రాలను తొలగించినంత మాత్రాన వాస్తవాలు మారవు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

నిజాలు చెప్పాలి..

ఆన్​లైన్​ మీడియా సమావేశం సందర్భంగా చైనా చొరబాట్లపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అజయ్​ మాకెన్​. ఈ విషయంలో పూర్తిస్థాయి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రక్షణ శాఖ తొలగించిన పత్రాల ద్వారా చైనా చొరబాట్లకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చైనాతో వ్యవహరించటంలో కేంద్రం ఎలాంటి వైఖరిని అవలంబిస్తోందని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.