ETV Bharat / bharat

ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

author img

By

Published : Aug 9, 2020, 5:44 AM IST

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మంగళూరుకు చెందిన వివేక్​ ట్రేడర్స్​.. సరికొత్త ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'ని ఆవిష్కరించింది. రోగనిరోధక శక్తి పెరిగి వైరస్​ శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందని చెబుతోంది ఈ సంస్థ. ఇప్పటికే మంగళూరు మార్కెట్లోకి విడుదల చేసింది. మరి దాని ధర, ఇతర విషయాలు తెలుసుకుందాం...

Vivek Traders Invented Ayush Chikki
ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయూష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే దారులు వెతుకుతున్నారు ప్రజలు. ఇదే సమయంలో ఆయుర్వేద సంస్థలు రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలను తయారుచేస్తున్నాయి. బాబా రాం​దేవ్​, బాలకృష్ణలకు చెందిన పతాంజలి సహా పలు సంస్థలు.. ఇప్పటికే ఇమ్యూనిటీ బూస్టర్​ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

తాజాగా కర్ణాటక మంగళూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల రీటైలర్​ వివేక్​ ట్రేడర్స్.. 'ఆయుష్​ చిక్కీ' పేరుతో​ సరికొత్త ఇమ్యూనిటీ బూస్టర్​ను ఆవిష్కరించింది. దీనిని తులసి​, అల్లం సహా పలు మిశ్రమాలతో తయారు చేసింది. ఈ పౌడర్​ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. కరోనా రాకుండా అడ్డుకుంటుందని సంస్థ పేర్కొంది.

"చిక్కీ అనేది భారతీయ సంప్రదాయ ఆహారం. దీనిని సాధారణంగా వేరుశనగ పప్పు, బెల్లం, తులసి, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. వేరుశనగపప్పు మానవ శరీరానికి చాలా అవసరం. వీటిని తీసుకోవటం ద్వారా పక్షవాతం సహా ఇతర వ్యాధులను అడ్డుకోవచ్చు. కేంద్ర ఆయుష్​ విభాగం ఇప్పటికే ఆయుష్​ క్వాతాకు అనుమతులు ఇచ్చింది. అందులో తులసి, దాల్చినచెక్క, అల్లం, నల్ల మిరియాలు ఉపయోగించటం ద్వారా కరోనాను అడ్డుకుంటోంది. ప్రస్తుతం ఆయుష్​ క్వాతాను మా ఆయుష్​ చిక్కీలో ఉపయోగించాం. కాబట్టి ఇది చాలా ఆరోగ్యకరం, రుచికరమైన ఇమ్యూనిటీ బూస్టర్​."

- వివేక్​ ట్రేడర్స్​

రూ.20కే..

ఆయుష్​ చిక్కీని ఇప్పటికే మంగళూరులో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది వివేక్​ ట్రేడర్స్​. కేవలం రూ.20లకే అందిస్తోంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్​పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని సంస్థ చెబుతోంది.

ఇదీ చూడండి: 'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.