ETV Bharat / bharat

దేశంలో మరొకరికి కరోనా- 6కు చేరిన బాధితులు

author img

By

Published : Mar 3, 2020, 5:36 PM IST

భారత పర్యటనకు వచ్చిన ఇటలీ దేశస్థుడికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత శనివారం రాజస్థాన్​లోని జైపుర్​కు వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా తొలుత నెగిటివ్​గా వచ్చినప్పటికీ.. రెండో పరీక్షలో పాజిటివ్​గా తేలింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఆరుకు చేరాయి.

Italian tourist in Jaipur tests positive for coronavirus
దేశంలో మరో వ్యక్తికి కరోనా-6కు చేరిన బాధితులు

రాజస్థాన్​ రాజధాని జైపుర్​ పర్యటనకు వచ్చిన ఇటలీ దేశస్థుడికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 6కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

వైరస్​ నియంత్రణ చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది. దేశంలో కొవిడ్​-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శితో పాటు.. పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ కూడా సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలపై చర్చించారు.

  • ఇవాళ కొత్తగా మరో ఆరు కరోనా కేసులు నమోదైనందున అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం నిత్యం సంప్రదింపులు
  • తగిన సూచనలు సలహాలు ఇస్తున్నట్లు వెల్లడించిన కేంద్రం.
  • కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు పర్యటక శాఖ పలు సూచనలు జారీ చేస్తూ.. తప్పని సరిగా పాటించాలని దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
  • ఈ రోజు వరకు పలు దేశాల పర్యటకులకు జారీ చేసిన అన్ని వీసాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.
  • భారత్‌లో తప్పనిసరిగా పర్యటించాల్సి వస్తే.. ప్రత్యేక అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • చైనా నుంచి వచ్చే పర్యటకుల సందర్శనపై ఇప్పటికే విధించిన నిషేధం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుందని స్పష్టం. చైనా నుంచి భారత్‌కు తప్పనిసరిగా రావాలనుకునే వారు మాత్రం దగ్గరో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని సూచన.
  • చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల నుంచి భారత్‌ వీసా పొంది ఇప్పటి వరకు వినియోగించుకోని వారి వీసాలను రద్దు చేసిన భారత్‌.
  • విదేశాంగ శాఖల అధికారులు, ఐక్యరాజ్యసమితి అధికారులు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, విమానయాన సిబ్బంది ఈ ఆంక్షల నుంచి మినహాయింపు.
  • అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టుల నుంచి భారత్‌లోకి వచ్చే వారు తప్పని సరిగా వారి వివరాలతో కూడిన పత్రాన్ని అందజేయాలని, దానిలో వారు తాజాగా.. ప్రయాణించిన వివరాలు, భారత్‌లో వారి అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలను ఆరోగ్య శాఖ అధికారులు, ఇమిగ్రేషన్‌ అధికారులకు అందించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.
  • చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, ఇరాన్‌, ఇటలీ, హాంకాంగ్‌, మకావు, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, తైవాన్‌ దేశాల నుంచి నేరుగా కానీ, ఆయా దేశాల నుంచి మారుతూ వచ్చినా.. తప్పని సరిగా వైద్య పరీక్షలకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు.
  • చైనా, ఇరాన్‌, కొరియా, ఇటలీ దేశాల సందర్శనకు ప్రస్తుత పరిస్థితుల్లో మానుకోవాలని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.