ETV Bharat / bharat

'కరోనాపై భారత్​ పోరుకు అంతర్జాతీయ గుర్తింపు'

author img

By

Published : May 11, 2020, 6:04 PM IST

Updated : May 11, 2020, 6:39 PM IST

pm-interacts-with-cms-on-ways-to-strengthen-covid-19-containment-strategy-boosting-economic-activities
కరోనాపై పోరు: సీఎంలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

17:57 May 11

కరోనాపై పోరు: సీఎంలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా విధించిన 54 రోజుల లాక్​డౌన్​ మరో వారంలో పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. కరోనాపై పోరాడాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు.

  • కరోనాను భారత్​ ఎదుర్కొంటున్న తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న కృషిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తోంది. మనం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
  • భారత్​లోని ఏఏ చోట్ల కరోనా ఎలా వ్యాపిస్తోంది మనకు ఇప్పుడు స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఏం చేయాలో గత కొద్ది వారాల్లో అధికార యంత్రాంగానికీ అర్థమైంది.
  • దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ మరింత ముమ్మరం అవుతుంది. ఇకపై మరింత స్పష్టమైన లక్ష్యాలతో, అప్రమత్తతతో కరోనాపై పోరును కొనసాగించాల్సిన అవసరముందని మనం అర్థం చేసుకోవాలి.
  • కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యంగా మనం ముందుకు సాగాలి. 'రెండు గజాల దూరం' నినాదంతో ప్రజలంతా విధిగా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలి.
  • గ్రామీణ భారతం కరోనా సంక్షోభం నుంచి విముక్తి పొందేలా చూడడం మన కర్తవ్యం.
Last Updated :May 11, 2020, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.