ETV Bharat / bharat

పాత బస్సును మహిళల టాయిలెట్​గా మార్చి..

author img

By

Published : Aug 27, 2020, 9:28 PM IST

Updated : Aug 27, 2020, 9:40 PM IST

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్యారేజీలో పడిఉన్న ఓ పాత బస్సును పబ్లిక్ టాయిలెట్​గా మార్చింది. బెంగళూరు విమానాశ్రయం (బీఐఏఎల్​) చొరవతో ఈ ఆలోచనకు రూపం ఇచ్చింది. ఇందులో సోలార్ లైట్లు, వాష్ బేసిన్, బేబీ ఫీడింగ్ వంటి సౌకర్యాలు కల్పించారు.

KSRTC
టాయిలెట్​ బస్సు

గ్యారేజీలో పడి ఉన్న పాత బస్సుతో పదిమందికి ఉపయోగపడేలా కర్ణాటక ఆర్టీసీ వినూత్న ఆలోచన చేసింది. కావాల్సిన మరమ్మతులు చేసి బస్సును పబ్లిక్​ టాయిలెట్​గా మార్చింది. మహిళల కోసమే దీనిని తయారు చేసినట్లు ఆర్​టీసీ అధికారులు తెలిపారు.

పాత బస్సును మహిళల టాయిలెట్​గా మార్చి

ఈ సదుపాయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాడి గురువారం ప్రారంభించారు. దీన్ని బెంగళూరు మేజిస్టిక్ బస్టాండ్​లో ఏర్పాటు చేశారు. పాడైన బస్సులను టాయిలెట్లుగా వినియోగించే అవకాశాన్ని ఆర్​టీసీ పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

KSRTC
బస్సు లోపల...

సామాజిక బాధ్యత కింద..

ఈ 'స్త్రీ టాయిలెట్' ప్రాజెక్టుకు​ రూ.12 లక్షలు ఖర్చయినట్లు ఆర్​టీసీ వెల్లడించింది. ఈ మొత్తాన్ని సామాజిక బాధ్యత కింద బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏఎల్​) భరించినట్లు తెలిపింది.

KSRTC
టాయిలెట్​ బస్సు
KSRTC
పరిశీలిస్తున్న లక్ష్మణ్​

"ఈ టాయిలెట్​ బస్సులో సౌర విద్యుత్​ను ఏర్పాటు చేశాం. సెన్సార్​ లైట్లు, వాష్ బేసిన్​, పిల్లలకు పాలు ఇచ్చే సౌకర్యంతో పాటు డైపర్లు, నాప్కిన్లు వంటి సదుపాయాలు కల్పించాం. ఇందులో 3 ఇండియన్ టాయిలెట్లు, 2 వెస్ట్రన్​ టాయిలెట్లు ఉన్నాయి."

- ఆర్​టీసీ ఆధికారి

ఇదీ చూడండి: 'నీట్​, జేఈఈ రాసేందుకు విద్యార్థులు సుముఖం'

Last Updated : Aug 27, 2020, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.