ETV Bharat / bharat

గంటలో 33 వంటకాలతో పదేళ్ల చిన్నారి రికార్డ్

author img

By

Published : Oct 12, 2020, 7:02 PM IST

kerala kid_cooking
గంటలో 30కి పైగా వంటకాలు చేసిన పదేళ్ల చిన్నారి

గంట సమయంలోనే 33 రుచికరమైన వంటకాలు చేసి నోరూరిస్తోంది కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి. అతి తక్కువ సమయంలో ఇన్ని వంటకాలు చేయడం వల్ల.. ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు సంపాదించింది.

కేరళ ఎర్నాకులం పట్టణానికి చెందిన పదేళ్ల చిన్నారి సాన్వి ఎమ్​ ప్రజీత్ తన ప్రతిభతో అందరినీ అబ్బురపరిచింది. గంటలో 33 వంటకాలు చేసి ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది.

భారత వాయు సేన అధికారి వింగ్​ కమాండర్​ ప్రజీత్​ బాబు, మంజిమ కూతురైన ఈ చిన్నారి రుచికరమైన వంటకాలు చేయడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఏం వండింది?

ఇడ్లీ, వాఫుల్, కార్న్​ ఫ్రిట్టర్స్, మష్రూమ్​ టిక్కా, ఊతప్పం, పనీర్​ టిక్కా, ఎగ్​ బుల్స్ ఐ, సాండ్​విచ్, పాపిడి ఛాట్, ఫ్రైడ్​ రైస్, చికెన్​ రోస్ట్, పాన్​కేక్, అప్పం మొదలైన 33 వంటకాలు చేసి సాన్వి రికార్డు సాధించింది.

ఆగస్టు 29న పదేళ్ల వయసులోనే సాన్వి ఈ భిన్నమైన వంటకాలు చేసి అందరి మన్ననలు పొందింది.

" విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వంటల కార్యక్రమాన్ని ఆసియా బుక్​ ఆఫ్ రికార్డు అధికారులు ఆన్​లైన్​ ద్వారా చూశారు. ఇద్దరు అధికారులు ప్రత్యక్షంగా కార్యక్రమానికి హాజరయ్యారు "

--మంజిమ, సాన్వి తల్లి.

తల్లి ఆదర్శంగా

ఈ ఘనత సాధించడానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని సాన్వి తెలిపింది. తన తల్లి మంజిమను ఆదర్శంగా తీసుకుని ఈ వంటకాలు నేర్చుకున్నానని చెప్పింది.

ఇతర వంటల పోటీల్లోనూ

చిన్నారులు వంటకాలు చేసే ఎన్నో కార్యక్రమాల్లో సాన్వి పాల్గొంది. తన రుచికరమైన వంటకాలతో చాలా మంది మన్ననలు పొందింది. తను చేస్తున్న వంటకాలు ఎక్కువ మందికి తెలిసేలా ఓ యూట్యూబ్​ ఛానల్​ కూడా నడిపిస్తోంది.

ఇదీ చదవండి: 'ట్రాన్స్​జెండర్లపై లైంగిక దాడులు ఆపేదెలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.