ETV Bharat / bharat

సచిన్​, కోహ్లీ, బాలీవుడ్​పై ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Feb 24, 2020, 2:32 PM IST

Updated : Mar 2, 2020, 9:46 AM IST

DONALD TRUMP ABOUT BOLLYWOOD AND CRICKET AT 'NAMASTE TRUMP' EVENT
సచిన్​ నుంచి కోహ్లీ, బాలీవుడ్​ చిత్రాల వరకు: ట్రంప్​

నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రసంగం ఉత్సాహభరితంగా సాగింది. ముఖ్యంగా సచిన్​, కోహ్లీ వంటి క్రికెటర్ల గురించి, బాలీవుడ్ చిత్రాలు, భారత పండుగల గురించి ట్రంప్​ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సచిన్​, కోహ్లీ, బాలీవుడ్​పై ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు

కరతాళధ్వనులు, అరుపులతో మోటేరా స్టేడియం హోరెత్తిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ భారత సినీ పరిశ్రమ బాలీవుడ్​పై ప్రశంసలు కురిపించారు. క్లాసిక్​ చిత్రాలు దిల్​వాలే 'దుల్హనియా లేజాయెంగే', 'షోలో' సినిమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.

భారత్​లో విశేష ఆదరణ ఉన్న క్రికెట్​ గురించి మాట్లాడారు ట్రంప్. ముఖ్యంగా సచిన్, కోహ్లీ గురించి, భారత పండుగలపై ట్రంప్​ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

"సృజనాత్మక బాలీవుడ్​ నుంచి ఏటా 2 వేల చిత్రాలు నిర్మితమవుతున్నాయి. ప్రపంచం మొత్తం బాంగ్రా నృత్యం, భారత క్లాసిక్ చిత్రాలు డీడీఎల్​జే, షోలే చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు. ​

ఈ దేశంలో ప్రపంచ దిగ్గజ క్రికెటర్లైన సచిన్‌ తెందూల్కర్​, విరాట్‌ కోహ్లీని ఎంతగానో అభిమానిస్తారు.

భారతదేశ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోలీ జరుపుకుంటారు." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Last Updated :Mar 2, 2020, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.