ETV Bharat / bharat

శనివారం నుంచి భక్తులకు శబరిమల దర్శనం

author img

By

Published : Oct 16, 2020, 9:05 AM IST

శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తెరవనున్నారు. భక్తులకు మాత్రం శనివారం ఉదయం 5 గంటల నుంచి అనుమతి ఉంటుంది. కరోనా ప్రభావంతో సుమారు ఆరునెలలుగా దర్శనాలను నిలపివేశారు.

Devotees to be allowed at Sabarimala from Oct 17
శనివారం నుంచి భక్తులకు శబరిమల దర్శన భాగ్యం

సుమారు ఆరు నెలల తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్​ కారణంగా మార్చి 24 నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. అయితే, నెలలో ఐదు రోజులు పూజలు నిర్వహించాలని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

ఈ క్రమంలో శుక్రవారం(16వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. భక్తలను మాత్రం శనివారం(17వ తేది) ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతినిస్తారు.

నెగెటివ్​గా తేలిన వారే..

భక్తులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

" దర్శనానికి వచ్చే భక్తులు 48 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల్లో నెగెటివ్​ వచ్చినవారికే అనుమతి ఉంటుంది. ఆన్​లైన్​ క్యూపోర్టల్​లో భక్తులు ముందుగానే నమోదు చేసుకోవాలి. తాము ఈ తీర్థయాత్రకు అనుకూలమేనని చెప్పే మెడికల్​ సర్టిఫికెట్స్​ సమర్పించాలి. రోజుకీ 250 మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తున్నాం. ​ "

-- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

వడసెర్రికర, ఎరుమేలి మార్గాలు తప్ప మిగతా అన్ని దారులను అధికారులు మూసివేశారు. సన్నిధానం, నిలక్కలోర్​ ప్రాంతాల్లో బసకు అనుమతి లేదు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి:కొవిడ్ వేళలో శబరిమల యాత్రకు ఈ నిబంధనలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.