ETV Bharat / bharat

దిల్లీలో 50 రోజులకు పెరిగిన కరోనా డబ్లింగ్​ రేటు

author img

By

Published : Aug 1, 2020, 2:40 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో కొవిడ్​ కేసుల డబ్లింగ్​ రేటు 21 రోజులు కాగా.. దిల్లీలో 50 రోజులకు పెరిగింది. యాక్టివ్​ కేసుల విషయంలోనూ 12వ స్థానానికి చేరిందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​ వెల్లడించారు.

Corona doubling rate in Delhi is @ 50 days
దిల్లీలో 50 రోజులకు పెరిగిన కరోనా డబ్లింగ్​ రేటు

దిల్లీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో కరోనా కేసుల డబ్లింగ్‌ రేటు 21 రోజులుగా ఉండగా.. దిల్లీలో మాత్రం 50 రోజులకు పెరిగినట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర‌ జైన్‌ వెల్లడించారు. మరోవైపు, దిల్లీలో శుక్రవారం 1195 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,35,598కి పెరిగింది. దేశంలో యాక్టివ్‌ కేసుల విషయంలో గతంలో దిల్లీ రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు 12వ స్థానానికి చేరిందని జైన్‌ తెలిపారు. రాజధాని నగరంలో 496 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దిల్లీలో సిరోలాజికల్‌ సర్వే కొనసాగుతుందని చెప్పారు.

దిల్లీలో హోటళ్లు తెరవడానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిరాకరించడంపై స్పందిస్తూ.. నోయిడా, గాజియాబాద్‌, హరియాణాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా హోటళ్లు తెరిచేందుకు అనుమతి ఉందన్నారు. దిల్లీలో కేసులు తగ్గుతున్న వేళ అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఇప్పటివరకు 1,20,930 మంది రికవరీ కాగా.. 3,963 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో రికవరీ రేటు 89.18శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,705 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.