ETV Bharat / bharat

చార్​ధామ్ యాత్ర ప్రారంభం- భక్తులకు ప్రవేశం లేదు!

author img

By

Published : Apr 26, 2020, 2:28 PM IST

శీతాకాలం కారణంగా ఆరు నెలల పాటు మూసేసిన చార్​ధామ్ పుణ్యక్షేత్రాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజారులు గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులను తెరిచారు.

gangotri
చార్​ధామ్ ప్రారంభం

పవిత్ర చార్​ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా నేడు ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను వేద మంతోచ్ఛారణల మధ్య శాస్త్రీయంగా తిరిగి తెరిచారు. అభిజిత్ లజ్ఞంలో మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 నిమిషాలకు యమునోత్రి పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి.

కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. ఈ కారణంగా ప్రారంభ పూజల్లో భక్తుల రద్దీ కనిపించలేదు. ఆలయ పూజాధికాలకు సంబంధించిన ముఖ్యులు, అధికారులు మాత్రమే ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

yamunotri
యమునోత్రిలో ప్రారంభ శోభ

గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను భౌతిక దూరం పాటిస్తూ శాస్త్రీయంగా తెరిచారు. అభిజిత్ లజ్ఞంగా పేర్కొంటున్న 12.35 నిమిషాలకు గంగోత్రి తలుపులను తెరిచారు. ఈ సందర్భంగా మూలవిరాట్ గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. కేదార్​నాథ్ ఆలయం ఈ నెల 29న, భద్రీనాథ్​ మే 15న తెరుచుకుంటాయి.

kedarnath
ఏప్రిల్ 29న తెరుచుకోనున్న కేదారీనాథ్

శీతాకాలంలో మంచు కారణంగా గంగామాత ముఖుబా గ్రామానికి, యమున మాత ఖుషిమఠ్​కు వస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆరునెలలపాటు చార్​ధామ్​ యాత్రను నిలిపేస్తారు. శీతాకాలం ముగిసిన అనంతరం ఆలయాలు పునఃప్రారంభమవుతాయి.

badrinath
భద్రీనాథ్.. మే 15న

ఇదీ చూడండి: 'కరోనా టెస్టుల్లో దూకుడేది? ఇలా అయితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.