ETV Bharat / bharat

అల్లర్లలో జవాను ఇల్లు కాలింది.. బీఎస్​ఎఫ్​ కానుకిచ్చింది

author img

By

Published : Mar 1, 2020, 12:39 PM IST

Updated : Mar 3, 2020, 1:25 AM IST

BSF to rebuild jawan's home burnt in Delhi riots as wedding gift
జవాన్​కు బీఎస్​ఎఫ్​ పెళ్లి కానుక.. ఏమిటో తెలుసా?

దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హింసాత్మకంగా మారిన ఈ నిరసనల్లో ఓ జవాన్​ ఇల్లు కాలిపోయింది. అయితే త్వరలో వివాహం చేసుకోబోతున్న అతనికి బీఎస్​ఎఫ్ ​అండగా నిలిచింది. జవాన్​ ఇంటిని తాము పునర్నిర్మించి పెళ్లి కానుకగా ఇస్తామని ప్రకటించింది.

అల్లర్లలో జవాను ఇల్లు కాలింది.. బీఎస్​ఎఫ్​ కానుకిచ్చింది

సీఏఏ అల్లర్ల కారణంగా ఇటీవల దేశ రాజధాని దిల్లీ అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 43మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు. బీఎస్ఎఫ్​ కానిస్టేబుల్​ మొహమ్మద్​ అనీస్​ ఇల్లు కూడా అల్లర్లలో భాగంగా కాలిపోయింది. అయితే త్వరలో వివాహం చేసుకోబోతున్న అనీస్​కు.. ఇంటిని పునర్నిర్మించి పెళ్లి కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది బీఎస్​ఎఫ్​. అలర్లలో జవాన్​ ఇల్లు ఘోరంగా దెబ్బతిందని, అయితే కుటుంబ సభ్యులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

"నిఘా వర్గానికి చెందిన ఇంజినీరింగ్​ విభాగం దిల్లీకి వచ్చి.. అనీస్​ ఇంటి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఇంటిని మేము పునర్నిర్మిస్తాం. బోర్డర్​ సెక్యురిటీ ఫోర్స్​ ఈ బాధ్యతను స్వీకరిస్తుంది. మా సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తాం. ప్రస్తుతం అనీస్​ ఫీల్డ్​లో ఉన్నాడు. త్వరలోనే దిల్లీకి బదిలీ చేస్తాం. తద్వారా కుటుంబానికి చేరువగా ఉంటాడు."

పుష్పేంద్ర రాథోడ్, బీఎస్​ఎఫ్​ సీనియర్​ అధికారి.

శనివారం అనీస్​ తల్లిదండ్రులను కలుసుకున్న బీఎస్​ఎఫ్​ డీఐజీ పుష్పేంద్ర రాథోడ్​.. అన్ని విధాల ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సంక్షేమ నిధి నుంచి రూ.10లక్షలు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్​కు ముందే ఇంటి పనులు పూర్తి చేసి.. అనీస్​కు వివాహ బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్​ సిలిగురి సమీపంలోని రాధాబరిలోని బీఎస్​ఎఫ్​ క్యాంప్​లో విధులు నిర్వర్తిస్తున్న అనీస్​.. అల్లర్లలో తన ఇంటికి జరిగిన నష్టం గురించి సీనియర్​ అధికారులకు ఒక్కమాట కూడా చెప్పలేదు.

ఇదీ చదవండి:ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

Last Updated :Mar 3, 2020, 1:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.